జాతీయ వార్తలు

అభివృద్ధికి చుక్కాని భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: అంతర్జాతీయ వృద్ధి రేటులో భారత్ చైనాను అధిగమించిందని, బలమైన వృద్ధి ధృవంగా అవతరించిందని హార్వర్డ్ యూనివర్శిటీ తాజాగా జరిపిన సర్వేలో స్పష్టమైంది. చైనాపై భారత్ సాధించిన ఈ వృద్ధి రానున్న దశాబ్దంపాటు కూడా కొనసాగే అవకాశం ఉంటుందని ఈ యూనివర్శిటీకి చెందిన అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం జరిపిన సర్వేలో వెల్లడైంది. 2025 వరకు అత్యంత వేగంగా అభివృద్ధి సాధించే దేశాల్లో భారత్ తొలి స్థానాన్ని సంతరించుకునే అవకాశం ఉంటుందని, దీని సగటు వార్షిక వృద్ధిరేటు 7.7 శాతం పైనే కొనసాగవచ్చునని తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిలో భారత్ సాధించిన ప్రగతి కొనే్నళ్ల క్రితమే చైనాను క్రమంగా అధిగమిస్తూ వచ్చిందని, ఇప్పుడది వృద్ధి స్థిరత్వాన్ని సంతరించుకుందని ఈ సర్వే వెల్లడింది. అన్ని రకాలుగానూ వృద్ధి, అభివృద్ధి అవకాశాలను మేళవించుకున్న భారత్ కచ్చితంగా తిరుగులేని రీతిలో ప్రగతి చుక్కానిగా మారే అవకాశం ఉంటుందని తెలిపింది. భారత్ ఎగుమతులుకూడా అనేక సంక్లిష్ట రంగాల్లోకి ప్రవేశించాయని, రసాయనాలు, వాహనాలు కొన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా అంతర్జాతీయ పోటీని తట్టుకునే విధంగా భారత్ ఎగుమతి చేయగలుగుతోందని ఈ సర్వే తెలిపింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే రానున్న కాలంలో చైనాను అధిగమించడమే కాకుండా చాలా బలమైన రీతిలోనే భారత్ తన ఆర్థిక సత్తాను చాటుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. చమురు ఎగుమతులపైనే ఆధారపడిన కొన్ని సంపన్న దేశాలు ఇటీవలి కాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని, అందుకు కారణం ఒకే వనరుపై ఆధారపడటమేనని పేర్కొంది. భారత్, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలు ఎగుమతుల పరంగా ఎంతో వైవిధ్యాన్ని సాధించాయని, సంక్లిష్ట రంగాల్లోకి ప్రవేశించి వృద్ధి రేటును ఇనుమడింపజేసుకుంటున్నాయని ఈ సర్వే తెలిపింది. ఆర్థిక వృద్ధి అన్నది అంత సులభంగా ఒకే మార్గంలో సాధ్యమయ్యేది కాదని భారత్, టర్కీ, ఇండోనేషియా, ఉగాండా, బల్గేరియా వంటి దేశాలు వేగంగా వృద్ధిని సాధిస్తున్నాయంటే అందుకు కారణంగా వాటి రాజకీయ, వ్యవస్థాగత, భౌగోళిక, జనాభాపరమైన అంశాలే కారణమని ఈ సర్వే స్పష్టం చేసింది. తమకున్న కార్మిక శక్తిని ఎప్పటికప్పుడు విస్తరించుకుంటూ భిన్న రంగాల్లోకి చొచ్చుకుపోతూ ఉత్పత్తులను పెంచుకుంటూ ఈ దేశాలు నిలబడగలగడమే వీటి అభివృద్ధి నిలకడతనానికి కారణమని తెలిపింది.