జాతీయ వార్తలు

యాత్రికులపై ఉగ్రపంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 10: కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న బస్సుపై సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఏడుగురు యాత్రికులు దుర్మరణం చెందారు. వీరిలో ఆరుగురు మహిళలున్నారు. దాడిలో మరో 32మంది గాయపడ్డారు. యాత్రికులంతా గుజరాత్ వాసులేనని పోలీసులు తెలిపారు. యాత్రికుల బస్సుపై దాడి జరిగే సమయానికి సోనా మార్గ్ నుంచి వస్తోందని, ఇందులోని యాత్రికులంతా అమర్‌నాథ్ యాత్ర ముగించుకుని వస్తున్నవారేనని తెలిపారు. ముందుగా మిలిటెంట్లు బోటెంగూ ప్రాంతంలో బుల్లెట్ ప్రూఫ్ బంకర్‌పై దాడి చేశారని, దాంతో పోలీసులు ఎదురుకాల్పులకు దిగారని తెలిపారు. ఇది విఫలం కావటంతో ఖన్నాబాల్ సమీపంలో పోలీస్ పికెట్‌పై దాడికి ఒడిగట్టారని, అక్కడా పోలీసుల నుంచి ప్రతిఘటన ఎదురుకావటంతో విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ మిలిటెంట్లు పారిపోయారన్నారు. ఆ సమయంలోనే యాత్రికుల బస్సును లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారని వెల్లడించారు. రాత్రి ఏడు గంటలు దాటిన తరువాత హైవేలపై ఎలాంటి యాత్రికుల వాహనాలను నడపకూడదన్న నిషేధాజ్ఞలను బస్సు డ్రైవర్ ఉల్లంఘించడం వల్లే ఘటన తలెత్తినట్టు చెబుతున్నారు. రాత్రి 8.20 గంటల ప్రాంతంలో దాడి జరిగిందని వివరించారు. అలాగే మరోచోట పోలీస్ వాహనంపైనా మిలిటెంట్లు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి యాత్రికులపై దాడి జరగటం ఇదే మొదటిసారి. దాడి జరిగిన వెంటనే జమ్ము శ్రీనగర్ హైవేను మూసేశారు. తమపై కాల్పులు జరుపుతున్న మిలిటెంట్లపై పోలీసులు ఎదురుకాల్పులకు దిగారని, దాంతో వారంతా పరారయ్యారని రెండో ఘటనకు సంబంధించి అధికారులు వెల్లడించారు. మిలిటెంట్ దాడిని తీవ్ర పదజాలంతో
గర్హించిన ప్రధాని నరేంద్రమోదీ, ఈ రకమైన పిరికిపంద చేష్టలకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. మిలిటెంట్ దాడి నేపథ్యంలో స్వయంగా పరిస్థితిని సమీక్షించిన ప్రధాని, కాశ్మీర్ గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా, సిఎం మెహబూబా ముఫ్తీతో మాట్లాడారు. ఉగ్రవాద సవాలును ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహాయపడతామని హామీ ఇచ్చారు. పవిత్ర అమర్‌నాథ్ యాత్ర చేపట్టిన వారిపై మిలిటెంట్లు ఈ రకమైన అమానుష దాడి జరపటం ఎంతో బాధ కలిగిస్తోందని, దీన్ని మాటల్లో వర్ణించలేమని మోదీ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరు దీన్ని గర్హించాల్సిందేనని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాన్నారు. మిలిటెంట్ల దాడులు అత్యంత గర్హనీయమైనవని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ నిప్పులు చెరిగారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలన్న భారత కృతనిశ్చయం ఈ దాడితో మరింత బలోపేతమవుతుందని వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

చిత్రం.. .. ఉగ్రదాడిలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న వైద్యులు