జాతీయ వార్తలు

ప్రజా ప్రభుత్వాలు ఖూనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిసూర్ (కేరళ), మే 9: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను రాజ్యాంగ విరుద్ధంగా మోదీ సర్కార్ కూల్చేస్తోందంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్వరంతో విరుచుకుపడ్డారు. కేరళలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సోనియా గాంధీ ప్రజాప్రభుత్వాలను కూలదోయడం ద్వారా వక్రమార్గం ద్వారా అందలం ఎక్కాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. సిపిఎం సారధ్యంలోని ఎల్‌డిఎఫ్‌పైనా విరుచుకుపడ్డారు. ఈ కూటమి అభివృద్ధి వ్యతిరేకమని. హింసారాజకీయాలే దాని ఆశయమని అన్నారు. అరుణాచల్, ఉత్తరాఖండ్‌లో తమ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలను మోదీ ప్రభుత్వం కూల్చేస్తోందని సోనియా ధ్వజమెత్తారు. విశ్వవిద్యాలయాలు, న్యాయవ్యవస్థ, ఎన్‌జివోలు, పౌర సమాజాలకే ఎన్‌డిఏ ప్రభుత్వం చేటు అని వ్యాఖ్యానించారు. మైనారిటీలు, దళితులు, మహిళలు, గిరిజనులను కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతోందని ప్రభుత్వాలను వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలను ఇతర వర్గాలు కూడా ద్రోహులుగా అభివర్ణిస్తున్నారని సోనియా అన్నారు. అట్టహాసంగా నిర్వహించే సభలకు ఎంతో సమయం వెచ్చించే మోదీకి రైతుల కడగండ్లు పట్టడం లేదని విమర్శించారు. పామోలిన్ దిగుమతులపై నియంత్రణ విధించేందుకు కేంద్రం అంగీకరించపోవడం వల్ల కొబ్బరి రైతులు నష్టపోయారని అన్నారు. తాము మొదలుపెట్టిన ఉపాధి హామీ పథకం సహా అనేక కార్యక్రమాలను మోదీ సర్కార్ దెబ్బతిస్తోందని, నిధుల విడుదల నిలిపివేస్తోందని అన్నారు. ప్రవాస భారతీయులకోసం ఏర్పాటు చేసిన మంత్రిత్వశాఖను తొలగించడం వల్ల ఇతర దేశాల్లో ఉంటున్న భారతీయలు ఎన్నోరకంగా ఇబ్బంది పడుతున్నారని సోనియా చెప్పారు. కేరళ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న రాష్టమ్రని పేర్కొన్న సోనియా లౌకికవాదానికి దీన్ని ప్రతీకగా పేర్కొన్నారు.

చిత్రం త్రిసూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న సోనియా