జాతీయ వార్తలు

500 ఉచిత కోర్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: దేశంలో ఈ విద్యాసంవత్సరం ఓపెన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో పది భాషల్లో కలిపి 500 ఉచిత కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సోమవారం వెల్లడించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆమె ఈ విషయం చెప్పారు. హ్యుమానిటీస్, సామాజిక శాస్త్రాలు, జనరల్ సైన్స్ సహా ప్రధాన కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు ఆమె వివరించారు. కొత్తగా ప్రవేశపెట్టబోయే కోర్సులను ఆన్‌లైన్, మొబైల్ అప్లికేషన్స్ పద్ధతుల్లో పూర్తిగా ఉచితంగా అందించాలని ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యుజిసి)తో కలిసి ఓపెన్, డిస్టెన్స్ లర్నింగ్ (ఒడిఎల్) విద్యావిధానంపై నియంత్రణ అంశాన్ని పరిశీలిస్తోందని మంత్రి వెల్లడించారు. ‘ఓపెన్ డిస్టెన్స్ లర్నింగ్ విద్య నియంత్రణపై ఆత్మశోధనం చేసుకోవలసిన అవసరం ఉంది. యుజిసితో కలిసి మేము ఆ పని చేస్తున్నాం’ అని ఇరానీ చెప్పారు. బోధన ప్రణాళికలను మెరుగు పరచే కృషిలో భాగంగా ప్రపంచంలోని వివిధ విద్యాసంస్థలతో చర్చిస్తున్నామని ఆమె తెలిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో (ఎన్‌ఐటిలు) బోధన ప్రణాళికను మెరుగు పరచేందుకు ప్రభుత్వం మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (ఎంఐటి)తో చర్చలు జరుపుతోందని మంత్రి వెల్లడించారు. దేశంలోని 62 జిల్లాల్లో కొత్తగా జవహర్ నవోదయ విద్యాలయాలను ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.