జాతీయ వార్తలు

విభజన హామీలన్నీ అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలన్నీ సాధించి తీరుతామని టిడిపి ఎంపీలు స్పష్టం చేశారు. విభజన హామీలు అమలు చేయడంతో పాటు, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ విభజన డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ భారీ ధర్నా జరిగింది. టిడిపి ఎంపీలు మురళీమోహన్, శివప్రసాద్, కొణకళ్ల నారాయణ, అవంతి శ్రీనివాస్, కె రామ్మోహన్ నాయుడు ధర్నా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి ఎంపీలు మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, రైల్వేజోన్ సాధించి తీరతామని అన్నారు. హామీల కోసం, రైల్వే జోన్ కోసం ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని వారు చెప్పారు. విశాఖ జిల్లా ఎపిజెఎఫ్ అధ్యక్షుడు శివశంకర్ నాయకత్వాన జరిగిన ఈ ధర్నాలో సిపిఐ నేత జెవి సత్యనారాయణ మూర్తి, జర్నలిస్టు ఫోరం నేతలు కృష్ణాంజనేయులు, మారేళ్ల వంశీకృష్ణ, ఎస్ దుర్గారావు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్లు ధర్నాకు మద్దతు తెలిపాయి.
ప్రభుత్వాలపై వినూత్న తరహాలో నిరసన తెలిపే తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ మరోసారి తనదైన శైలిలో గొంతువిప్పారు. అనేక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఈసారి ఏకంగా రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్‌లా వేషం వేసుకుని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఏపికి ప్రత్యేక హోదా కోరుతూ సోమవారం ఉదయం పార్లమెంట్ అవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేకప్‌తో నిరసన తెలిపారు. శివప్రసాద్ విలేఖరులతో మాట్లాడుతూ విభజన చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తూ కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్‌కి, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రాష్ట్రాలతో సమానంగా చూస్తే ఎలా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబుకి సహకరించాలని ఆయన కోరారు. ఎపికి ప్రత్యేక హోదా, రాయితీలు, రైల్వేజోన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు సవరించారని, ప్రత్యేక హోదాకోసం మరోసారి సవరించాలని ఎంపీ సూచించారు. ఆయన అంబేడ్కర్ లాగా మాట్లాడుతూ కళాకారుడినైన తాను ఈ విధంగా నిరసన తెలిపే హక్కుందని అన్నారు.

చిత్రం పార్లమెంటు ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద అంబేద్కర్ వేషధారణలో నిరసన తెలుపుతున్న టిడిపి ఎంపీ శివప్రసాద్