జాతీయ వార్తలు

రాహుల్‌ను హతమారుస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని హతమారుస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో రాహుల్ సహా కాంగ్రెస్ అగ్ర నేతలకు భద్రతను పెంచాలని ఆ పార్టీ ప్రతినిధుల బృందం సోమవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరింది. రాహుల్ గాంధీని హతమారుస్తామని పేర్కొంటూ ఒక బెదిరింపు లేఖ కాంగ్రెస్ పార్టీ పుదుచ్చేరి శాఖ అధ్యక్షుడికి అందింది. పుదుచ్చేరి శాసనసభకు ఈ నెల 16న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మంగళవారం అక్కడ నిర్వహించే ఒక బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడవలసి ఉంది. ఈ బెదిరింపు లేఖ తమిళంలో రాసి ఉందని కాంగ్రెస్ పార్టీ పుదుచ్చేరి శాఖ తెలిపింది. రాహుల్ గాంధీని హతమారుస్తామంటూ వచ్చిన ఈ లేఖను కాంగ్రెస్ నాయకుడు నారాయణ స్వామి తీసుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఆనంద్ శర్మ, అహ్మద్ పటేల్ వంటి సీనియర్ నాయకులతో కూడిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం సోమవారం రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసింది. తమ పార్టీ అగ్ర నేతలకు తగినంత భద్రత కల్పించాలని ఈ బృందం హోంమంత్రిని డిమాండ్ చేసింది. అలాగే ఈ బెదిరింపు లేఖపై దర్యాప్తు జరిపించాల్సిందిగా కోరింది. రాహుల్ గాంధీ, అతని కుటుంబ సభ్యులకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత కల్పిస్తోంది. గాంధీ కుటుంబంతో పాటు ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఎస్‌పిజి భద్రత కల్పిస్తోంది. 1991లో తమిళనాడులో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురికావడంతో మాజీ ప్రధానుల కుటుంబాలను కూడా ఎస్‌పిజి భద్రత పరిధిలోకి తీసుకువస్తూ చట్ట సవరణ చేశారు.