జాతీయ వార్తలు

మోదీ క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: ‘‘మా నాయకురాలిపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేసిన ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే. ‘ఫేకూ’ మామా మాఫీ మాంగే.. (అబద్ధాలు చెప్పిన మోదీ క్షమాపణ చెప్పండి). మీరు క్షమాపణ చెప్పేంతవరకు సభ జరిగే సమస్యేలేదు..’’ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీ సోమవారం చేసిన హంగామా ఇది. అగస్టా వెస్ట్‌లాండ్ కేసుకు సంబంధించి కేరళ, తమిళనాడు ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై అబద్ధాలు ప్రచారం చేశారంటూ ఆ పార్టీ సభ్యులు ఉభయ సభల్లోనూ గందరగోళం సృష్టించారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్‌సభలోనూ కాంగ్రెస్ సభ్యులది అదే తీరు. అగస్టా వెస్ట్‌లాండ్ వ్యవహారంలో గతవారం ఉభయ సభల్లో రక్షణ మంత్రి అధికారికంగా చేసిన ప్రకటనల్లో కూడా లేని వాటిని ప్రధాని ప్రచారం చేయటం దురదృష్టకరమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ప్రధానమంత్రిని సభలోకి వచ్చి ప్రకటన చేయమనే అధికారం ‘చైర్’కు లేదని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభ్యులకు తెలియజేశారు. అయినా సభ్యులు వినకపోవటంతో మధ్యాహ్నం 12గంటలలోపు రెండుసార్లు రాజ్యసభను కురియన్ వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రశ్నోత్తరాలను కొనసాగించాలన్న రాజ్యసభ చైర్మన్ హమిద్ అన్సారీ విజ్ఞప్తులను విపక్ష సభ్యులు లెక్కచేయలేదు. అటు లోక్‌సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ప్రధాని మాటలు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ల దర్యాప్తులను ప్రభావితం చేసేలా ఉన్నాయని అన్నారు. రూ.3600 కోట్ల అగస్టావెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల వ్యవహారంలో ఏ కోర్టు సోనియాగాంధీని తప్పుపట్టిందో ప్రధాని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ప్రధానిపై హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుందని కూడా ఖర్గే అన్నారు. తమిళనాడు, కేరళ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడుతూ, ఇటాలియన్ కోర్టు సోనియాగాంధీని అగస్టా కేసులో దోషిగా పేర్కొందని మోదీ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తమ పార్టీ నేతలెవరైనా, అధికారులెవరైనా దోషులుగా తేలినట్లయితే శిక్షించవచ్చన్న వైఖరికి కట్టుబడి ఉంటూనే కాంగ్రెస్ మోదీపై విరుచుకుపడింది. ఈ అంశంలో జరుగుతున్న చర్చల్లో మోదీ ఎందుకు పాల్గొనటం లేదని నిలదీసింది. రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ.. సభ వెలుపల మోదీ ఎలాంటి విధాన ప్రకటన చేయలేదన్నారు. అగస్టా కేసులో ముడుపులు తీసుకున్న ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు.

చిత్రం రాజ్యసభలో సోమవారం స్పీకర్ పోడియం వద్ద నిలబడి గొడవ చేస్తున్న కాంగ్రెస్ సభ్యులు