జాతీయ వార్తలు

రాష్టప్రతి ఎన్నిక నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: కొత్త రాష్టప్రతిని ఎన్నుకునేందుకు సర్వం సిద్ధమైంది. దేశంలోని మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిపి 4,852 సభ్యులు రాష్టప్రతిని ఎన్నుకునేందుకు సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పార్లమెంటుతోపాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో సోమవారం ఉదయం పదకొండు గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. ఎన్‌డిఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ఏడు లక్షల ఓట్లు పడతాయని అంచనా వేస్తున్నారు. పార్లమెంటు భవనంలోని 62వ నంబర్ గదిలో కొత్త రాష్టప్రతి ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రారంభం అవుతుంది. మెజారిటీ ఎంపీలు పార్లమెంటు భవనంలో ఓటు హక్కును వినియోగించుకుంటుంటే తృణమూల్ కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షాలకు చెందిన మరికొంతమంది ఎంపీలు తమ రాష్ట్రాల్లో ఓటు వేయనున్నారు. కొందరు శాసనసభ్యులు ప్రత్యేక అనుమతితో పార్లమెంటు పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి కె.పి.వౌర్య లోక్‌సభ సభ్యత్యానికి ఇంకా రాజీనామా చేయనందున వీరుకూడా లక్నోలో ఎంపీ స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ నెల 20న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 25న పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖేహర్ కొత్త రాష్టప్రతి చేత పదవి స్వీకార ప్రమాణం చేయిస్తారు. ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి 23న పార్లమెంటు ఆవరణలోని సెంట్రల్ హాల్‌లో ఏర్పాటుచేసే ప్రత్యేక సమావేశంలో వీడ్కోలు చెబుతారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 62వ గదిలోని ఆరో నంబర్ టేబుల్‌పై ఓటు వేస్తారు. ప్రధాన మంత్రి, తదితర ప్రముఖులకోసం ఆరో నంబర్ టేబుల్‌ను రిజర్వు చేయటం గమనార్హం. ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యుల మొత్తం ఓట్ల విలువ పదకొండు లక్షలు. ఇందులో ఎన్‌డిఏ ఆభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు 65 నుండి 70 ఓట్లు పడతాయని బిజెపి నాయకులు అంచనా వేస్తున్నారు. యుపిఏ అభ్యర్థి, మాజీ స్పీకర్ మీరాకుమార్‌కు 35 శాతం ఓట్లు పడతాయని అంటున్నారు. జెడి(యు)కు చెందిన ఎంపీలతోపాటు శాసనసభ్యులు రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఇవ్వటం తెలిసిందే. దేవెగౌడ నాయకత్వంలోని జెడి(ఎస్) కూడా ఆయనకే మద్దతు ఇస్తోంది. దీనితోపాటు ప్రతిపక్షానికి చెందిన మరికొన్ని పార్టీల ఎంపీలు, శాసనసభ్యుల ఓట్లు కూడా రామ్‌నాథ్ కోవింద్‌కు పడే అవకాశాలున్నాయి. తమ ఎంపీలు ఎక్కడ రామనాథ్ కోవింద్‌కు అనుకూలంగా ఓటు వేస్తారేమోననే అనుమానంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం నలుగురు సీనియర్ ఎంపీలు మినహా మిగతా ఎంపీలందరితో కోల్‌కతాలో ఓటు వేయిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు త్రిపుర శాసన సభ్యులు రామ్‌నాథ్ కోవింద్‌కు ఓటు వేస్తామని ప్రకటించటం తెలిసిందే. గుజరాత్ శాసనసభ్యుడైన బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, ఈ రాష్ట్రానికి చెందిన నలుగురు శాసన సభ్యులు తమ ఓటు హక్కును పార్లమెంటు పోలింగ్ కేంద్రంలో వినియోగించుకోనున్నారు. 14 మంది రాజ్యసభ సభ్యులు, 41 మంది లోక్‌సభ సభ్యులు తమ రాష్ట్రాల శాసనసభల్లో ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి మంజూరు చేసింది. నలుగురు శాసనసభ్యులు తమ రాష్ట్రాల శాసనసభలకు బదులు ఇతర రాష్ట్రాల శాసనసభల్లో ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నుండి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ఆర్‌సిపి రామ్‌నాథ్ కోవింద్‌కు తమ మద్దతు ప్రకటించటం తెలిసిందే. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మద్దతను రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రకటించటంతో ప్రతిపక్షం బలం బాగా తగ్గిపోయింది.

చివరి నిముషం వరకూ ప్రచారం

ఎన్‌డిఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్, యుపిఏ అభ్యర్థి మీరాకుమార్ ఆదివారం సాయంత్రం వరకు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రామ్‌నాథ్ సాయంత్రం ఎన్‌డిఏ మిత్రపక్షాలకు చెందిన పార్లమెంటు సభ్యులను పార్లమెంటు ఆవరణలో కలుసుకున్నారు. బిజెపి సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన ఎంపీలకు అభివాద చేస్తూ అందరితో కలియ తిరిగారు. మీరాకుమార్ కూడా పార్లమెంటు ఆవరణలోని గ్రంథాలయంలో తనకు మద్దతు ఇస్తున్న పదిహేడు పార్టీల సీనియర్ నాయకులు, పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు.

చిత్రాలు.. ఎన్‌డిఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్, యుపిఏ అభ్యర్థి మీరాకుమార్