జాతీయ వార్తలు

ఆత్మప్రబోధంతో ఓటు వేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: రాష్టప్రతి ఎన్నికలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆత్మప్రబోధంతో ఓటు వేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. తమ అభ్యర్థిగా మీరాకుమార్‌ను పోటీకి పెట్టడానికి కారణం సంకుచిత, విచ్ఛిన్నకర, మతతత్వ ధోరణులను ప్రతిఘటించాలన్నదేనని ఆదివారం ఇక్కడ సోనియా స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ప్రతిపాదించిన రాష్టప్రతి, ఉప రాష్టప్రతి అభ్యర్థులతో కలిసి ప్రతిపక్ష నేతలతో కలిసి మాట్లాడిన సోనియా గాంధీ ‘ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల
అభ్యర్థులకు ప్రతికూలంగానే సంఖ్యాబలం ఉన్నప్పటికీ, ఈ పోటీ జరగాల్సిందే, విజయం కోసం గట్టిగా పోటీ పడాల్సిందే’నని అన్నారు. భారతదేశంపై మతతత్వ, సంకుచిత ధోరణులు రుద్దుతున్న వారికి తలవంచడానికి వీల్లేదని బిజెపిని పరోక్షంగా ప్రస్తావిస్తూ అన్నారు. భారతదేశం స్వాతంత్య్రం కోసం ఏవిధంగా పోరాడామో గుర్తు చేసుకోవాలని, దేశ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మనం విశ్వసించే విలువలపై మనకు నమ్మకం ఉండాలని, తాజాగా రెండు అత్యున్నత పదవులకు జరుగుతున్న ఎన్నికలు ఆదర్శాల మధ్య జరుగుతున్న పోరాటమేనని, విలువల మధ్య జరుగుతున్న సంఘర్షణేనని సోనియా అన్నారు. ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీ, స్వాతంత్య్ర సమరయోధులు ఆశించిన భారతావనిని పరిరక్షించుకోవాలంటే ఆత్మప్రబోధంతోనే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

చిత్రం.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ