జాతీయ వార్తలు

అణచివేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: గోసంరక్షణ పేరిట గూండాయిజాన్ని సహించడానికి వీల్లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా ఈ పెడ ధోరణిని తిప్పికొట్టాలని ఆదివారం ఇక్కడ జరిగిన అఖిలపక్ష సమావేశంలో పిలుపునిచ్చారు. గోసంరక్షణ పేరుతో హింసాకాండకు పాల్పడుతున్న సంఘ వ్యతిరేకుల శక్తుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా మోదీ అఖిలపక్ష భేటీ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని, వీటికి భంగం కలిగించే ఎలాంటి చర్యలను ఉపేక్షించడానికి వీల్లేదని ఉద్ఘాటించారు. ‘గోవు మనకు తల్లి లాంటిది. ఈ మూగజీవికి సంబంధించిన ఏ అంశమైనా భావోద్వేగంతో కూడుకున్నదే అవుతుంది’ అని పేర్కొన్న మోదీ గోసంరక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలెన్నో ఉన్నాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ ఉల్లంఘించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అంతేగాని గోసంరక్షణ కోసం ఈ రకమైన దాడులకు తెగబడటం ఎంతమాత్రం సహించదగ్గది కాదని తెలిపారు. అఖిలపక్ష సమావేశానంతరం కూడా మోదీ అనేక ట్వీట్లలో ఈ అంశానికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. గోసంరక్షకులు చేస్తున్న దాడులవల్ల అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట కూడా దెబ్బతింటోందన్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పిలుపునిచ్చారు. అయితే ఈ అంశాన్ని సాకుగా తీసుకుని వ్యక్తిగత ప్రతీకారాలను కూడా తీర్చుకుంటున్నారా అన్న అంశంపై కూడా దృష్టి పెట్టాలని కోరారు. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు గోసంరక్షణ ముసుగులో ఈ రకమైన అరాచకాలకు పాల్పడుతున్నాయని, అలాగే ఇంకొన్ని శక్తులు దేశ సామాజిక
సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ఒడిగడుతున్నాయని అన్నారు. గోవు పేరిట జరిగే మత హింసాకాండను అణచివేయడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాలని మోదీ కోరారు. అలాగే ఈ అంశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ లేదా మతపరమైన రంగు పులమడానికి వీల్లేదనీ స్పష్టం చేశారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ‘గోసంరక్షకులు’ హింసాకాండకు పాల్పడుతున్నారంటూ వస్తున్న కథనాల నేపథ్యంలో మోదీ మాటలకు మరింత ప్రాధాన్యత చేకూరింది. ముస్లింలు, దళితులను లక్ష్యంగా చేసుకునే ఈ దాడులకు ఒడిగడుతున్నారంటూ విపక్షాలుకూడా ఇప్పటికే మోదీ సర్కార్‌పై దుమ్మెత్తిపోశాయి. ఇదే అంశాన్ని రేపటినుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తడానికీ సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అఖిలపక్ష భేటీని బలమైన ఆయుధంగా మార్చుకున్న మోదీ గోసంరక్షణ పేరిట జరిగే దాడులను అరికట్టడంతో పాటు అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సహకరించాలని విపక్షాలను కోరడం గమనార్హం.
దేశాన్ని దోచుకున్నవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటే దాన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించడం ఎంతమాత్రం నైతికం కాదని తృణమూల్ కాంగ్రెస్, ఆర్‌జెడి పార్టీలపై మోదీ పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఈ రకమైన ఆరోపణలతో ఎవరూ తమ అవినీతి చర్యలనుంచి తప్పించుకోలేరని అన్నారు. రేపు జరగనున్న రాష్టప్రతి ఎన్నికను కూడా ప్రస్తావించిన మోదీ ‘కొత్త రాష్టప్రతిపై అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరివుంటే బాగుండేది’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఎన్నిక ప్రచారంలో అధికార, ప్రతిపక్షాలు ఉన్నతస్థాయిలో హుందాతనంతో ప్రచారాన్ని సాగించాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ఏ ఓటూ వృథా కాకూడదని కూడా మోదీ స్పష్టం చేశారు.

చిత్రం.. ఆదివారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ