జాతీయ వార్తలు

జాధవ్ క్షమాభిక్ష తిరస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: పాకిస్తాన్‌లో గూఢచర్యం ఆరోపణలపై మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్ క్షమాబిక్ష పిటిషన్‌ను పాకిస్తాన్‌లోని మిలిటరీ కోర్టు తిరస్కరించింది. ఇక ఇప్పుడు ఆయనకు క్షమాబిక్ష పెట్టాలా వద్దా అనే దానిపై నిర్ణయం ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా పైనే ఆధారపడి ఉందని పాక్ ఆర్మీకి చెందిన మీడియా విభాగం ఐఎస్‌పిఆర్ తెలిపింది. క్షమాబిక్ష పిటిషన్‌ను జనరల్ బాజ్వా ముందు దాఖలు చేసినట్లు ఐఎస్‌పిఆర్ గత నెల 22న జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, జాధవ్ తల్లి దాఖలు చేసిన మరో క్షమాబిక్ష పిటిషన్‌ను కూడా పాక్ అధికారులు పరిశీలిస్తున్నారు. భారత ఇంటెలిజన్స్ ఏజన్సీ తరఫున గూఢచర్యం నిర్వహిస్తున్నాడన్న ఆరోపణపై జాధవ్‌కు పాక్ మిలిటరీ కోర్టు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను భారత్ అర్థం లేనివిగా కొట్టిపారేసింది. దీనిపై భారత్ హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో అపీలు చేసుకోగా, తుది తీర్పు వెలువడే దాకా జాధవ్ ఉరిని ఆపేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం పాక్‌ను కోరింది. అంతేకాదు పాకిస్తాన్ అన్యాయంగా జాధవ్‌ను కాన్సులర్ అధికారులు కలుసుకొనే అవకాశాలు లేకుండా చేసిందన్న భారత్ ఆరోపణలతో హేగ్ కోర్టు అంగీకరించింది కూడా. అయితే అంతర్జాతీయ న్యాయస్థానం గత నెలలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ జాధవ్‌ను భారత కాన్సులేట్ అధికారులు కలుసుకోవడానికి అనుమతించలేదు. కాగా, దౌత్య మార్గాలద్వారా ఈ మేరకు చేసిన ప్రయత్నాల్లో ఎలాంటి పురోగతి లేదు. జాధవ్ తల్లి వీసా దరఖాస్తుకు సంబంధించి పాక్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్‌కు తాను రాసిన లేఖకు ఎలాంటి సమాధానం రాకపోవడంతో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్‌కు ఏ మాత్రం దయలేదని ఆమె విమర్శించడం తెలిసిందే. అయితే భారత్‌తో 2008లో చేసుకున్న ఒప్పందం ప్రకారం గూఢచారులకు కాన్సులేట్ అధికారులను కలుసుకొనే అవకాశం ఉండదని పాక్ వాదిస్తోంది.