జాతీయ వార్తలు

బాదుష్ జైలులో ఉండొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులు మూడేళ్ల కిందట అపహరించిన 39 భారతీయులు బహుశా పశ్చిమ మోసుల్‌లోని బాదుష్ జైలులో ఉండవచ్చని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. ఇరాక్‌లో అపహరణకు గురైన భారతీయుల బంధువుల సమావేశంలో సుష్మా మాట్లాడారు. మోసుల్ నగరం ఐసిస్ ఆధీనంలో ఉన్నప్పుడు అక్కడ పనిచేస్తున్న 39 మంది భారతీయులను ఉగ్రవాదులు అపహరించిన విషయం తెలిసిందే. ఇరాక్ ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు అపహరణకు గురైన భారతీయులను మొదట ఆస్పత్రి నిర్మాణ స్థలంనుంచి వ్యవసాయ క్షేత్రానికి, అక్కడినుంచి పశ్చిమ మోసుల్‌లోని బాదుష్ జైలుకు తరలించినట్లు తమ వద్ద సమాచారం ఉందని చెప్పారు. ఈ మేరకు పూర్తి సమాచారం విదేశాంగ శాఖ సహాయ మంత్రి వికె సింగ్ దగ్గర ఉందని ఆమె తెలిపారు.