జాతీయ వార్తలు

జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్లు రూ.64.56వేల కోట్లకు చేరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: దేశవ్యాప్తంగా జన్‌ధన్ ఖాతాల్లో జమ అయిన సొమ్ము రికార్డు స్థాయిలో రూ.64,564 కోట్లకు చేరుకుంది. ఇందులో రూ.300 కోట్లకు పైగా డిపాజిట్లు పెద్దనోట్ల రద్దు అనంతరం తొలి ఏడు నెలల్లోనే జమ అయినట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని అన్ని వర్గాల ప్రజలతోపాటు నిరాదరణకు గురైన రంగాలను బ్యాంకింగ్ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా జన్‌ధన్ పథకాన్ని ప్రారంభించిన విషయం విదితమే. నిల్వ ఏమీ లేకుండా (జీరో బ్యాలెన్స్‌తో) బ్యాంకు ఖాతాలను తెరిచేందుకు ఈ పథకం వీలు కల్పిస్తోంది. ఈ ఏడాది జూన్ 14వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 28.9 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉన్నాయని, వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 23.27 కోట్ల ఖాతాలు ఉండగా, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 4.7 కోట్ల ఖాతాలు, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో 92.7 లక్షల ఖాతాలు ఉన్నట్లు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిందని పిటిఐ వార్తా సంస్థ పేర్కొంది.