జాతీయ వార్తలు

కార్డు లావాదేవీలు 7 శాతమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలు డిజిటల్ పేమెంట్స్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. మొత్తం మీద డిజిటల్ లావాదేవీలు 23 శాతం పెరగ్గా అందులో క్రెడిట్, డెబిట్ కార్డులద్వారా జరిపిన లావాదేవీలు 7 శాతం మాత్రమేనని ‘పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ ఎకానమీ దిశగా మార్పు’ అనే అంశంపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటు స్థారుూసంఘానికి వివిధ మంత్రిత్వ శాఖలు ఇచ్చిన ఓ ప్రజంటేషన్‌లో తెలిపారు. 2016 నవంబర్‌లో 27.5 మిలియన్లుగా ఉండిన డిజిటల్ లావాదేవీలు 2017 మే నాటికి 23 శాతం పెరిగి 27.5 మిలియన్లకు చేరుకున్నట్లు ఆ ప్రజంటేషన్‌లో వెల్లడించారు. ఎక్కువ మంది యుపిఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా లావాదేవీలు జరపడానికి మొగ్గు చూపించారని దాన్నిబట్టి అర్థమవుతోంది. 2016 నమంబర్‌లో ఈ పద్ధతిద్వారా లావాదేవీలు జరిపే వారు రోజుకు పది లక్షల మంది ఉండగా, 2017 నాటికి 3 కోట్లకు చేరుకున్నారు. కాగా, ఎలక్ట్రానిక్ ఫండ్ బదిలి సేవ అయిన ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపిఎస్) ద్వారా జరిపే లావాదేవీలు సైతం ఇదే సమయంలో దాదాపు రెట్టింపు అంటే 1.2 మిలియన్లనుంచి 2.2 మిలియన్లకు పెరిగాయి. ప్లాస్టిక్ కార్డులు అంటే డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలే చాలా తక్కువగా అంటే 7 శాతమే పెరిగాయని, 2016 నవంబర్‌లో ఈ లావాదేవీలు 6.8మిలియన్లుగా ఉండగా, 2017 మే నాటికి 7.3 మిలియన్లకు పెరిగినట్లు అధికారులు ఇచ్చిన ప్రజంటేషన్ వెల్లడించింది. నల్లధనాన్ని అదుపు చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 8న వెయ్యి, 500 రూపాయల పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రపకటించిన విషయం తెలిసిందే. దీనితర్వాత ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలు జరిపేలా ప్రజలను ప్రోత్సహిస్తున్న విషక్షం తెలిసిందే.