జాతీయ వార్తలు

పెన్నులు తేవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: రాష్టప్రతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ వెంట పెన్నులు తీసుకురావద్దని ఎన్నికల కమిషన్ (ఇసి) తెలియజేసింది. ఓటు వేసేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన మార్కర్‌ను అందజేస్తామని కూడా స్పష్టం చేసింది. గత ఏడాది హర్యానాలో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా సిరాపై వివాదం తలెత్తిన నేపథ్యంలో రాష్టప్రతి, ఉపరాష్టప్రతి ఎన్నికల సందర్భంగా ఓటు వేసే వారికోసం ప్రత్యేక పెన్నులను ఉపయోగించాలని ఇసి నిర్ణయించింది. ఓటింగ్ చాంబర్‌లో ప్రవేశించే ముందు పోలీసు సిబ్బంది ఒకరు ఓటరునుంచి వారి వ్యక్తిగత పెన్నులను తీసుకొని బ్యాలెట్ పేపర్‌పైన ఓటును మార్క్ చేయడానికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన పెన్‌ను అందజేస్తారని, ఓటు వేసి తిరిగి వెళ్లే ముందు సిబ్బంది మార్కర్‌ను తీసుకుని వారి వ్యక్తిగత పెన్నులను తిరిగి ఇచ్చేస్తారని ఇసి ప్రతినిధి వివరించారు. రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికల రూల్స్, 1974 కింద వేరే ఏ ఇతర పెన్నును ఉపయోగించినా ఓట్ల లెక్కింపు సమయంలో ఆ ఓటును చెల్లనిదిగా పరిగణిస్తారని పోలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసిన సమయంలో ఇసి స్పష్టం చేసింది. మైసూర్ పెయింట్స్, వార్నీష్ లిమిటెడ్ ఈ ప్రత్యేక పెన్నులను సరఫరా చేస్తోంది.
మొట్టమొదటిసారిగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ సమయంలో చేయాల్సిన, చేయకూడని నిబంధనలను ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల కమిషన్ జారీచేసిన పెన్నును మాత్రమే ఉపయోగించాలని, ఏ అభ్యర్థికి అనుకూలంగా ఏ రాజకీయ పార్టీ కూడా విప్ లేదా ఆదేశాలను జారీ చేయకూడదని కూడా ఆ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఇది రహస్య ఓటింగ్ అయినందున ఓటరు తాను ఎవరికి ఓటు వేసిందీ వెల్లడించకూడదు. కాగా, ఎంపీలకు ఆకుపచ్చ రంగు బ్యాలెట్ పత్రాలను, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను ఇస్తున్నారు. ఓట్లను లెక్కించే సమయంలో సులభంగా ఉండడానికి ఈ ఏర్పాటు చేశారు. మొత్తం ఎలక్టోరల్ కాలేజి ఓట్ల విలువ 10,98,903. ఓట్ల లెక్కింపు కోసం వివిధ రాష్ట్రాలనుంచి బ్యాలెట్ పెట్టెలను ఈ నెల 20 నాటికల్లా ఢిల్లీకి తీసుకువస్తారు. ఎమ్మెల్యేలు 4,120 మంది, 776 మంది ఎన్నికయిన ఎంపీలు సోమవారం రాష్టప్రతి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. వీరిలో 233 మంది రాజ్యసభనుంచి ఎన్నికయిన ఎంపీలు కాగా, 543 మంది లోక్‌సభ సభ్యులు. మొత్తం 32 పోలింగ్ కేంద్రాలు పార్లమెంట్ హౌస్‌లో ఒకటి, ప్రతి రాష్ట్ర శాసనసభలో ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణకోసం ఇసి 33 మంది పరిశీలకులను నియమించింది. వీరిలో ఇద్దరిని పార్లమెంటు భవనంలో నియమించనుండగా, ప్రతి రాష్ట్ర అసెంబ్లీకి ఒక్కొక్కరిని నియమిస్తారు. సోమవారం ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎంపీలుగా ఉన్న ఉత్తరప్రదేశ్, గోవా ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, మనోహర్ పారికర్‌లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.