జాతీయ వార్తలు

కోవింద్.. ముందుగానే కంగ్రాట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: మరికొద్ది గంటల్లో రాష్టప్రతి పదవికి ఎన్నిక జరుగనున్న తరుణంలో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అడ్వాన్స్‌గా అభినందనలు తెలిపారు. ఆయనకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చిన మోదీ ‘మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు కోవింద్ ఆయనకు సహాయకుడిగా పని చేశారు. మా ప్రభుత్వం ఆయనకు పూర్తి సహకారం అందిస్తుంది’ అని ఆదివారం ఇక్కడ జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో మోదీ అన్నారు. రాష్టప్రతిని ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజిలో దాదాపు మూడింట రెండు వంతుల మెజారిటీ ఎన్డీఏకున్నందువల్ల రాష్టప్రతి పదవికి కోవింద్ ఎన్నిక లాంఛనంగానే మారింది. ఎన్డీఏ కూటమిలో లేని కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపాయి. మోదీ ప్రసంగ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ తెలియజేశారు. ఈ ఎన్నికల్లో ఆత్మప్రబోధంతో ఓటు వేయాలంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునివ్వడాన్ని ప్రస్తావించిన అనంత్‌కుమార్ ‘దాదాపు నలభై రాజకీయ పార్టీలు కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి. బిహార్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఎన్డీయేతర ముఖ్యమంత్రులూ ఆయనకు మద్దతిస్తున్నారు’ అని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కోవింద్ విజయం లాంఛనమేనని పేర్కొన్న ఆయన ఎన్డీఏ కూటమికున్న బలాన్ని ప్రస్తావించారు.