జాతీయ వార్తలు

వేడెక్కనున్న ‘వర్షాకాలం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: కొత్త రాష్టప్రతి, ఉప రాష్టప్రతిని ఎన్నుకోవటంతోపాటు వివిధ అంశాలకు సంబంధించిన పద్దెనిమిది బిల్లులపై చర్చ జరిపి ఆమోదించేందుకు సోమవారం నుండి ఆగస్టు 11 తేదీ వరకు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ముఖాముఖి యుద్ధానికి సిద్ధమయ్యాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసేందుకు పద్దెనిమిది ప్రతిపక్షాలు ఐదు ప్రధాన అంశాలతో విమర్శనాయుధాలను సిద్ధం చేసుకున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటి రోజు ఉభయ సభలు ఎలాంటి కార్యక్రమం నిర్వహించకుండానే మరుసటి రోజుకి వాయిదా పడతాయి. లోక్‌సభ ప్రస్తుత సభ్యుడు వినోద్ ఖన్నా, రాజ్యసభ ప్రస్తుత సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి మృతిమూలంగా ఉభయ సభలు ఇరువురు నాయకుల మరణం పట్లసంతాపం తెలిపిన అనంతరం మంగళవారానికి వాయిదా పడతాయి. ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం ఎంపీలందరూ కొత్త రాష్టప్రతి ఎన్నుకునేందుకు ఓటు వేసేందుకు వెళతారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, గిట్టుబాటు ధర లభించకపోవటం వలన సమస్యల సుడి గుండంలో పడిపోయిన రైతుల గురించి, జీఎస్టీ మూలంగా సగటు మనిషి పడుతున్న కష్టాలు, కాశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో గో వధ పేరుతో జరుగుతున్న దాడులు, సిక్కిం సెక్టార్‌లో భారత, చైనా సైనికుల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని కడిగిపారేసేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు తోడ్పడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ప్రతిపక్షాలకు విజప్తి చేశారు. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆదివారం సాయంత్రం ఎంపిలకు ప్రత్యేక విందు సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని ఆమె వారికి విజప్తి చేశారు. వర్షాకాల సమావేశాల్లో కొత్త రాష్టప్రతి, కొత్త ఉపరాష్టప్రతిని ఎన్నుకోవటంతోపాటు మొత్తం పద్దెనిమిది బిల్లులు చర్చకు రానున్నాయి. కాశ్మీర్‌లో జీఎస్టీ అమలుకు సంబంధించిన బిల్లుతోపాటు విద్య, అంతర్గత భద్రత, ఆర్థిక, కార్మిక, నౌకాయానం తదితర అంశాలకు సంబంధించిన బిల్లులు ఉభయ సభల్లో చర్చకు రానున్నాయి. ప్రతిపక్షం ప్రధానంగా సిక్కిం సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల, జమ్ముకాశ్మీర్‌లో కొనసాగుతున్న గొడవలు, అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన దాడి, దేశంలోని వివిధ ప్రాంతాల్లో గో సంరక్షణ పేరుతో ఇతర మతాల వారిపై జరుగుతున్న దాడుల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది. పద్దెనిమిది ప్రతిపక్ష పార్టీలు లోక్‌సభ, రాజ్యసభలో సమైక్యతతో వ్యవహరిస్తూ ఎన్‌డిఏ ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపేందుకు సిద్ధమయ్యాయి.
ఇలావుండగా, టిఆర్‌ఎస్, తెలుగు దేశం పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచే అంశాన్ని ప్రస్తావించనున్నాయి. ఏపి విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు శాసన సభల సీట్లు పెంచే అంశంపై ఎన్‌డిఏ ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణ, ఏపి శాసన సభల సీట్లు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపాదిస్తారా లేదా? అనేది హోం శాఖ అధికారులు చెప్పలేకపోతున్నారు. శాసన సభల సీట్లు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లు ఇటీవలనే న్యాయ శాఖ నుండి కేంద్ర హోం శాకు వెళ్లింది. ఈ బిల్లును వర్షాకాల సమావేశాల్లో ప్రతిపాదించాలనుకుంటే మొదట దీనిని కేంద్ర మంత్రివర్గం ఆమోదించవలసి ఉంటుంది. ఈ బిల్లు ఎప్పుడు మంత్రివర్గం పరిశీలనకు వెళుతుందనేది కూడా స్పష్టం కావటం లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పచ్చ జెండా చూపిస్తే తప్ప శాసనసభల సీట్లు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు మోక్షం లభించదని అంటున్నారు. ఏపిలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ఆర్‌సిపి పార్లమెంటు ఉభయ సభల్లో ఏపికి ప్రత్యేక హోదాపై ప్రస్తావించేందుకు సిద్ధమవుతోంది. తెలుగుదేశం ఎంపిలు శాసన సభల సీట్ల పెంపకంతోపాటు విభజన చట్టంలో ఇచ్చిన ఇతర హామీల త్వరితగతిన అమలుకు పట్టుపట్టవచ్చు.

చిత్రం.. ఢిల్లీలో ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్