జాతీయ వార్తలు

గెలుపు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: బిజెపి మిత్రపక్షాల రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని తేలిపోయింది. ప్రతిపక్షానికి చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు ఆయనకు ఓటు వేసినట్టు సమాచారం. భారతదేశ 14వ రాష్టప్రతిని ఎన్నుకునేందుకు ఉద్దేశించిన ఓటింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. పార్లమెంటుతోపాటు, వివిధ రాష్ట్రాల రాజధానుల్లో కొత్త రాష్టప్రతి ఎన్నికలకు సంబందించిన పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం పార్లమెంట్ ఆవరణలోని 62వ నెంబర్ గదిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చి మొదటి ఓటు వేశారు. వెంటనే బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రెండో ఓటు వేశారు. అమిత్ షాతోపాటు గుజరాత్ శాసనసభకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా పార్లమెంటు పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. నరేంద్ర మోదీ పోలింగ్ ప్రారంభం కావటానికి నాలుగు నిమిషాల ముందే పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అయితే సిబ్బంది మాత్రం మరో నాలుగు నిమిషాలు ఆగాల్సిందేనని చెప్పారు. దీనికి మోదీ స్పందిస్తూ తాను చిన్నప్పుడు కూడా పాఠశాలకు నాలుగైదు నిమిషాలు ముందే వెళ్లేవాడినని అన్నారు. ఆయన అక్కడి కొద్దిసేపు నిలబడి సమయం పది గంటలుకాగానే బ్యాలట్ పత్రం తీసుకుని మొదటి ఓటు వేశారు. మోదీ తన గుర్తింపు పత్రం చూపించి బ్యాలెట్ పేపర్ అందుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్, ఉప నాయకుడు ఆనంద్ శర్మ తదితర ప్రముఖులు ఉదయం 11.30కు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఉదయం తొమ్మిదిన్నరకే పార్లమెంట్ ఆవరణలోని 62 నెంబర్ గదిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారు. అయితే భద్రతా వ్యవహారాల మూలంగా మొదట ప్రధాని నరేంద్ర మోదీ ఓటు, అమిత్ షా ఓటు వేసిన తరువాతే ఇతరులు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. పత్రికా ఫోటోగ్రాఫర్లను కూడా దూరంగా నిలిపివేసి అక్కడినుండే ఫోటోలు తీసేందుకు అనుమతిచ్చారు. భద్రతా కారణాల దృష్ట్యా లోక్‌సభ ప్రెస్ గ్యాలరీకి వెళ్లే మీడియాను వెనకవైపు దారినుండి లోక్‌సభలోకి పంపించారు. పోలింగ్ మొదట మందకొడిగా సాగింది. అయితే పార్లమెంట్ ముగిసిన అనంతరం పుంజుకుంది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు, రాజ్యసభ సభ్యురాలు మీసాభారతి కలసివచ్చి ఓటు వేశారు. తెరాస సభ్యులు గుంపుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. తెలుగుదేశం, వైకాపా సభ్యులు కూడా కలిసికట్టుగా వచ్చి ఓటు వేశారు. కేంద్ర పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ మంత్రి హర్షవర్దన్ గుర్తింపు కార్డుతో రాకపోవటంతో ఓటు వేసేందుకు అనుమతి లభించలేదు. గుర్తింపు కార్డు చూపిస్తే తప్ప ఓటు వేసేందుకు అనుమతించటం జరగదని ఎన్నికల సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో ఆయన తన వ్యక్తిగత సిబ్బందిని పంపించి గుర్తింపు కార్డు తెప్పించుకున్న తరువాతే ఓటు వేయగలిగారు. ఎంపీలు బ్యాలెట్ పత్రాన్ని పరిశీలించిన అనంతరం ప్రత్యేక సిరాతో ముద్రవేసే ప్రక్రియ కోసం 62 నెంబర్ గదిలో పలు టేబుళ్లు, కుర్చీలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పత్రాన్ని వేసే బాక్స్‌ను మాత్రం గది మధ్యలో ఏర్పాటు చేసిన ఒక పొడవాటి టేబుల్‌పై అమర్చారు. ప్రజా ప్రతినిధులు టేబుల్‌పై కూర్చుని బ్యాలెట్ పత్రంపై గుర్తు వేసిన అనంతరం అక్కడికి వచ్చి బ్యాలెట్ బాక్స్‌లో తమ ఓటును వేసి వెళ్లారు.
చిత్రం.. తొలి ఓటు వేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ