జాతీయ వార్తలు

డిఐజి రూప బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 17: అన్నా డి ఎంకె ప్రధాన కార్యదర్శి వికె శశికళ జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ నివేదిక ఇచ్చిన జైళ్ల శాఖ డిఐజి డి.రూపపై కర్ణాటక ప్రభుత్వం వేటు వేసింది. రూపతో పాటు డిజిపి(జైళ్లు) హెచ్ ఎన్ సత్యనారాయణరావుపై కూడా ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అదనపు డిజిపిగా ఉన్న ఎన్ ఎస్ మేఘారిఖ్‌ను జైళ్ల శాఖ అదనపు డిజిపిగా రావు స్థానంలోకి బదిలీ చేశారు. రూపను ట్రాఫిక్, రోడ్డు భద్రత విభాగపు డిఐజిగా పోస్టింగ్ ఇచ్చారు. జూలై 12న సత్యనారాయణరావుకు లేఖ రాసిన రూప, శశికళ తనకు అన్ని సౌకర్యాలు ఇవ్వటానికి రెండు కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. శశికళ కోసం ప్రత్యేకంగా ఓ వంటశాల కూడా పనిచేస్తోందని కూడా ఆమె ఆరోపించారు. రూప చేసిన ఈ ఆరోపణలను సత్యనారాయణరావు ఖండించారు. ఆమెపై చట్టపరమైన చర్యలకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇదంతా మీడియాలో రచ్చ కావటంతో కర్ణాటక ప్రభుత్వం ఇద్దరిపైనా బదిలీ వేటు వేసింది.