జాతీయ వార్తలు

విజయం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: ఉపరాష్టప్రతి పదవికి జరుగుతున్న ఎన్నికల్లో బిజెపి మిత్రపక్షాల అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఎం.వెంకయ్య నాయుడు భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఉపరాష్టప్రతిగా ఎన్నికయ్యేవారు రాజ్యసభ అధ్యక్ష పదవీ బాధ్యతలు కూడా నిర్వహిస్తారు. ఆగస్టు 5న జరిగే ఎన్నికలో ప్రతిపక్షాల తరపున బరిలోకి దిగిన గోపాలకృష్ణ గాంధీ బిజెపి అభ్యర్థి వెంకయ్యనాయుడుకు ఏమాత్రం సమ ఉజ్జీ కాదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఉపరాష్టప్రతిని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారనేది తెలిసిందే. లోక్‌సభలో ఎన్‌డియేకు భారీ మెజారిటీ ఉంటే, రాజ్యసభలో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉంది. అయితే లోక్‌సభతోపాటు రాజ్యసభకు చెందిన కొన్ని ప్రతిపక్ష పార్టీలు, తటస్థ పార్టీలు మద్దతు ప్రకటించటంతో వెంకయ్య నాయుడు భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో మొత్తం సభ్యుల సంఖ్య 790 ఉంటే ఇందులో దాదాపు 550 మంది సభ్యులు వెంకయ్యకు ఓటు వేస్తారని బిజెపి అధినాయకత్వం అంచనా వేస్తోంది. లోక్‌సభలో 543 మంది ఎన్నికైన సభ్యులు, ఇద్దరు నామినేటెడ్ సభ్యులుంటే, రాజ్యసభలో 233 మంది ఎన్నికైనవారు, 12 మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. బిజెపి మిత్రపక్షాలకు చెందిన సభ్యులతోపాటు ప్రతిపక్షానికి చెందిన జెడి(యు), జె.డి(ఎస్) సభ్యులు వెంకయ్యకు అనుకూలంగా ఓటు వేస్తారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రాలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ఆర్‌సిపి సభ్యులు, తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నా డిఎంకెకు చెందిన రెండు వర్గాలు, బిజెడి పార్టీలకు చెందిన సభ్యులు బిజెపి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు. ఓటింగ్ జరిగే ఆగస్టు ఐదో తేదీనే సాయంత్రమే ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాన్ని ప్రకటిస్తారు. రాజ్యసభ ప్రస్తుత అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు హమీద్ అన్సారీ పదవీ కాలం ఆగస్టు 11తో ముగుస్తుంది. అన్సారీ ఆగస్టు 11న రాజ్యసభను వాయిదా వేసిన అనంతరం తన చాంబర్‌లోకి వచ్చి కొత్త అధ్యక్షుడికి పదవీ బాధ్యతలు అప్పగిస్తారు.
అభినందనల వెల్లువ
రాజ్యసభ సభ్యులు వెంకయ్య నాయుడును అభినందనలతో ముంచెత్తారు. వెంకయ్య ఉదయం 10.55 గంటకు సభలోకి రాగానే మొదట మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆయనను అభినందించారు. ఉపరాష్టప్రతి పదవి చేపడుతున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నానని మన్మోహన్ సింగ్ చెప్పగానే వెంకయ్య నాయుడు నవ్వుతూ సమస్కారం చేశారు. ఇంతలో పలువురు అధికార, ప్రతిపక్ష సభ్యులు కూడా ముందుకు వచ్చి వెంకయ్యతో కరచాలనం చేశారు. రాజ్యసభ పదకొండు గంటలకు ప్రారంభమయ్యేంత వరకు అధికార, ప్రతిపక్ష సభ్యులు, పలువురు కేంద్ర మంత్రులు అభినందిస్తూనే ఉన్నారు.