జాతీయ వార్తలు

ఉభయ సభలు వాయదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: సోమవారం ప్రారంభమైన వర్షాకాల పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండానే మంగళవారం నాటికి వాయిదా పడ్డాయి. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనీల్ మాధవ్ దవే, కేంద్ర మాజీ మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు, రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి, ప్రముఖ సినీనటుడు వినోద్‌ఖన్నా, మరో నలుగురు మాజీ ఎంపీల మృతిపట్ల సంతాపం తెలిపి రెండు నిమిషాలపాటు వౌనం పాటించిన అనంతరం ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ మొదట కొత్త సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత కేంద్ర మంత్రి ధవే, గురుదాస్‌పూర్ లోక్‌సభ సభ్యుడు వినోద్‌ఖన్నాతోపాటు మరో నలుగురు మాజీ ఎంపీల మరణం పట్ల సంతాపం తెలిపారు. అనంతరం లోక్‌సభ సభ్యులు రెండు నిమిషాలపాటు వౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు. రాజ్యసభ ఉదయం సమావేశం కాగానే అధ్యక్షుడు హమీద్ అన్సారీ కేంద్ర మంత్రి దవే, కేంద్ర మాజీ మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు, పాల్వాయి గోవర్దన్ రెడ్డి మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆ తరువాత సభ్యులు వౌనం పాటించారు.