జాతీయ వార్తలు

మధ్యాహ్న భోజనంలోకి కందిపప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనంలోకి కందిపప్పును వినియోగించాలని రాష్ట్రాలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశించింది. ప్రభుత్వ గోదాముల్లో నిలువ ఉన్న కందిపప్పును మధ్యాహ్న భోజనానికి ఉపయోగించాలని కేంద్ర ఆహారశాఖ చేసిన విజ్ఞప్తి మేరకు వివిధ విభాగాల కార్యదర్శుల కమిటీ మానవ వనరుల అభివృద్ధి శాఖకు సిఫారసు చేసిందని ఆ శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుషావహ లోక్‌సభలో వివరించారు. సభ్యులడిగిన ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన ఆయన, కందిపప్పును వినియోగించటానికి కొన్ని రాష్ట్రాలు ఆసక్తిని కనబరచాయన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రాల వారిగా కందిపప్పును అందించేందుకు తగిన ధరను నిర్ణయించేందుకు ఒక విధానాన్ని రూపకల్పన చేయాలని మానవ వనరుల శాఖ వినియోగదారుల వ్యవహారాల విభాగాన్ని కోరినట్లు మంత్రి పేర్కొన్నారు.
డోక్లామ్ మనదే: జయశంకర్
న్యూఢిల్లీ, జూలై 17: సిక్కింలోని డోక్లామ్ ట్రైజంక్షన్ వద్ద నెలకొన్న సంక్షోభంపై వాస్తవ పరిస్థితిని విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జయశంకర్ సోమవారం పార్లమెంటరీ స్థారుూ సంఘానికి వివరించారు. రాహుల్ గాంధీ సభ్యుడుగా ఉన్న ఈ కమిటీకి ఎంపి శశిథరూర్ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. డోక్లామ్ అన్నది భారతీయ పేరు అని, చైనా సైన్యం అక్కడ రోడ్డు నిర్మించాలని చేసిన ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుందని పేర్కొన్నారు. డోక్లామ్ భారతీయ పేరు అని భూటాన్ ఈ ప్రాంతాన్ని డోకాలాంగా గుర్తించిందని, చైనా మాత్రం డోంగ్లాంగ్‌లో ఈ ప్రాంతం అంతర్భాగమని పేర్కొంటోందని తెలిపారు.