జాతీయ వార్తలు

డోక్లామ్‌మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: సిక్కింలోని డోక్లామ్ ట్రైజంక్షన్ వద్ద నెలకొన్న సంక్షోభంపై వాస్తవ పరిస్థితిని విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జయశంకర్ సోమవారం పార్లమెంటరీ స్థారుూ సంఘానికి వివరించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభ్యుడుగా ఉన్న ఈ కమిటీకి ఎంపి శశిథరూర్ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు.డోక్లామ్ అన్నది భారతీయ పేరు అని చైనా సైన్యం అక్కడ రోడ్డు నిర్మించాలని చేసిన ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుందని పేర్కొన్నారు. డోక్లామ్ భారతీయ పేరు అని భూటాన్ ఈ ప్రాంతాన్ని డోకాలాంగా గుర్తించిందని, చైనా మాత్రం డోంగ్లాంగ్ లో ఈ ప్రాంతం అంతర్భాగమని పేర్కొంటోందని తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద చైనా రోడ్ల నిర్మాణాలు చేపడుతోందని జయశంకర్ విపక్ష నేతలకు తెలిపారు.