జాతీయ వార్తలు

రాజ్యసభ సభ్యత్వానికి మాయావతి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో తనను మాట్లాడనివ్వలేదంటూ మాయావతి మంగళవారం తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా మంగళవారం రాజ్యసభ ప్రారంభకాగానే గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితులలో ఉత్తరప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతోన్న దాడులను ప్రస్తావిస్తూ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ చైర్మన్ కురియన్‌ను మాయావతి కోరారు. ఉత్తరప్రదేశ్ షహరాన్‌పూర్‌లో దళితులపై దాడుల అంశాన్ని ఆమె లేవనెత్తారు. ఈ అంశంపై మాట్లాడేందుకు పది నిమిషాల సమయం కోరినా, ఆమెకిచ్చిన 3 నిమిషాలు పూర్తికాగానే డిప్యూటీ చైర్మన్ అడ్డుపడటంతో మాయావతి ఆగ్రహానికి లోనయ్యారు. తనకు అవకాశం కల్పించకపోతే తక్షణమే రాజీనామా చేస్తానని ఆవేశంగా ప్రకటించి చేతిలోని పత్రాలను విసిరే శారు. సభనుంచి వాకౌట్ చేశారు. కాగా డిప్యూటీ చైర్మన్‌ను అవమానించేలా మాయావతి ప్రవర్తించారని, ఇందుకు క్షమాపణలు చెప్పలని పార్లమెంటరీ వ్యవహరాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ డిమాండ్ చేశారు. ఆమె సభలో ప్రకటించిన విధంగానే మూడు పేజీల రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ ఉపరాష్టత్రి హమీద్ అన్సారీకి అందించారు. ‘నా రాజీనామా లేఖను అందించేందుకు చైర్మన్‌ను కలుసుకున్నాను. నాకు అత్యంత సన్నిహితమైన, నా మనోభావాలకు సంబంధించిన అంశంపై నన్ను మాట్లాడనివ్వకపోవడమన్నది క్షంతవ్యం కాదు. నేను మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం అడ్డు తగిలింది. నా ప్రసంగాన్ని పూర్తిచేయనివ్వలేదు’ అని మాయావతి మీడియాతో ఆవేదనగా అన్నారు. తాను ప్రసంగిస్తున్నంతసేపూ అధికారపక్ష సభ్యులు లేచి అవరోధాలు కలిగించేందుకు ప్రయత్నించారని, తనను ముందుకు సాగనివ్వలేదని ఆరోపించారు. ఈ రకమైన పరిణామాలు ఎంతమాత్రం మంచివి కాదన్నారు. కాగా, మాయావతి రాజీనామాపై తుది నిర్ణయం చైర్మన్‌దేనని రాజ్యసభ వర్గాలు తెలిపాయి. సభ్యుల రాజీనామాకు సంబంధించిన నియమావళి చాలా స్పష్టంగా ఉంటుందని, రాజీనామాకు ఫలానా అంశమే కారణమని ఆ ఫార్మాట్‌లో స్పష్టం చేయడానికి వీల్లేదని ఆ వర్గాలు వివరించాయి.