జాతీయ వార్తలు

అట్టహాసంగా నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: ఉప రాష్టప్రతి పదవికి ఎన్టీయే తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి వెంకయ్యనాయుడు, ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. వెంకయ్యనాయుడు ఉదయం 11.30కు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలను సెక్రటరీ జనరల్ శంషేర్ కె షరీఫ్‌కు అందజేశారు. ప్రధాని మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ మార్గదర్శక మండలి సభ్యులు ఎల్‌కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, సీనియర్ మంత్రులు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, అనంతకుమార్, రాంవిలాస్ పాశ్వాన్, నితిన్ గడ్కరీ తదితరులు వెంట ఉన్నారు. వెంకయ్య మొత్తం మూడు సెట్ల నామినేషన్లకు షరీఫ్‌కు అందించారు. వెంకయ్య నామినేషన్ పత్రాలను దాఖలు చేయగానే మోదీ, షా తదితరులు ఆయనను అభినందనలతో ముంచెత్తారు. తరువాత మోదీ కార్యాలయానికి వెళ్లిన వెంకయ్య, ప్రధాని ఆశీస్సులు తీసుకున్నారు. ఇక ప్రతిపక్షం తరపున రంగంలోకి దిగిన గోపాలకృష్ణ మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ మనుమడైన గోపాలకృష్ణ గాంధీ నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు వచ్చినప్పుడు ఆయన వెంట మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్
అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, జెడి (యు) అధినేత శరద్ యాదవ్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ కార్యదర్శి డి రాజా, టిఎంసి రాజ్యసభ పక్షం నాయకుడు డెరిక్ ఓబ్రనే, ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్, డిఎంకె ఎంపీ కనిముళి, ఎన్సీపీ నేత ప్రపుల్ల పటేల్, తారిక్ అన్వర్ తదితరులు ఉన్నారు. గోపాలకృష్ణ గాంధీ కూడా మూడు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల దాఖలు పూర్తి కాగానే మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ తదితర నేతలంతా గోపాలకృష్ణ గాంధీని అభినందించారు.

చిత్రాలు.. ఉప రాష్టప్రతి ఎన్నికకు నామినేషన్లు దాఖలు చేస్తున్న వెంకయ్యనాయుడు, గోపాలకృష్ణ గాంధీ