జాతీయ వార్తలు

‘ప్లాస్టిక్’పై లోక్‌సభ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: దేశవ్యాప్తంగా కల్తీలతో పాటు నకిలీ ఆహార పదార్థాలు హడలెత్తించడంతో లోక్‌సభ సభ్యులు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ కోడిగుడ్లు, బియ్యం విక్రయిస్తున్నారని, దీని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని స్పష్టం చేశారు. అయితే ఇంతవరకూ ప్రత్యేకంగా ఇందుకు సంబంధించి తమకు సమాచారం ఏమీ రాలేదని వివరణ ఇచ్చిన కేంద్రం ఇలాంటి నకిలీ ఆహార పదార్థాలపై రాష్ట్ర ప్రభు త్వం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ప్లాస్టిక్ కోడిగుడ్ల వ్యవహారం, ఆహార భద్రతా నియంత్రణ సంస్థ( ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) దృష్టికి వచ్చిందని, అంతర్జాతీయ ఆహార భద్రత అథారిటీ నెట్‌వర్క్ ఈ అంశంపై దృష్టి పెట్టిందని కేంద్రం తెలిపింది. ఈ సంస్థ ఇప్పటికే ప్లాస్టిక్ బియ్యం, చక్కెరకు సంబంధించి అప్పటి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిందని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి సుదర్శన్‌భగత్ తెలిపారు. తెరాస సభ్యుడు మల్లారెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా ఆయన లిఖిత పూర్వకంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నకిలీలకు సంబంధించి రాష్ట్రాలను అప్రమత్తం చేయటం జరిగిందని స్పష్టం చేశారు. అన్ని రకాల ఆహార వస్తువులను ఫసాయ్ అధికారులు తరచూ తనిఖీ చేస్తూనే ఉంటారని తెలిపారు.