జాతీయ వార్తలు

పలు రైళ్ల మళ్లింపు.. రీషెడ్యూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను మళ్లించింది. మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసినట్టు ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఉమాశంకర్ కుమార్ తెలిపారు. బ్రిడ్జి నెం. 588వద్ద భారీ వర్షపు ప్రమాదకర హెచ్చరిక నేపథ్యంలో సింగపూర్-తెరుబాలి మధ్య, ఈస్ట్‌కోస్ట్ రైల్వే పలు రైళ్లను మళ్లించింది. విశాఖపట్నం-హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుంచి దువ్వాడ, విజయవాడ, బల్లార్షా, నాగపూర్ స్టేషన్ల నుంచి మళ్లించారు. పూరి నుంచి బయలుదేరే పూరి-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు విజయనగరం, దువ్వాడ, విజయవాడ, బల్లార్షా, నాగపూర్ మీదుగా మళ్లించారు. బిలాస్‌పూర్-తిరుపతి రైలు బిలాస్‌పూర్ నుంచి వయా రాయపూర్, గోండియా, బల్లార్షా, విజయవాడ మీదుగా తిరుపతి చేరుకుంటుంది. అదేవిధంగా హాటియా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు హాటియా నుంచి వయా బిలాస్‌పూర్, రాయ్‌పూర్, బల్లార్షా, విజయవాడ మీదుగా హటియా చేరుకుంటుంది. అస్నోల్-చెన్నై, సెంట్రల్ అస్నోల్ నుంచి బిలాస్‌పూర్, రాయ్‌పూర్, నాగపూర్, బల్లార్షా, విజయవాడ మీదుగా మళ్లించారు. టాటానగర్-యశ్వంత్‌పూర్, టాటానగర్ వయా బిలాస్‌పూర్, రాయ్‌పూర్, నాగపూర్, బల్లార్షా, విజయవాడ మీదుగా మళ్లించినట్టు ఉమాశంకర్ కుమార్ పేర్కొన్నారు. అలాగే హటియా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను వయా బిలాస్‌పూర్, రాయ్‌పూర్, నాగపూర్, బల్లార్షా, విజయవాడ మీదుగా, హటియా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ను బిలాస్‌పూర్,నాగపూర్, బల్లార్షా, విజయవాడ మీదుగా, టాటానగర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ బిలాస్‌పూర్, రాయపూర్, నాగపూర్, బల్లార్షా, విజయవాడ మీదుగా మళ్లించినట్టు ఆయన వివరించారు. అదేవిధంగా హటియా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వయా విజయనగరం, కుర్దారోడ్, భద్రక్, హిజ్జి, టాటా స్టేషన్ల మీదుగా మళ్లించి, అలపుజా-్ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ రీషెడ్యూల్ అయిందని, ఈ రైలు అలఫుజా నుంచి బయలుదేరుతుందని ప్రజాసంబంధాల ముఖ్య అధికారి ఉమాశంకర్ కుమార్ పేర్కొన్నారు.