జాతీయ వార్తలు

గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం పద్దెనిమిది గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంగళవారం ఆమోద ముద్ర వేసింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. వీటిలో భోగాపురంతోపాటు మరో ఆరు గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలకు సైట్ క్లియరెన్స్ అనుమతి కూడా లభించింది. నెల్లూరు జిల్లాలోని దగదర్థి, పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం, కర్నూలు జిల్లాలోని ఒరవకల్లు, చిత్తూరు జిల్లాలోని కుప్పం, ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలోగ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనలు తమకు అందాయని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు సైట్ క్లియరెన్స్ అనుమతి ఇవ్వటం జరిగిందని గజపతిరాజు తెలిపారు. దగదర్థి, భోగాపురం, ఒరవకల్లు విమానాశ్రయాల నిర్మాణానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు అశోకగజపతిరాజు ప్రకటనలో వివరించారు.