జాతీయ వార్తలు

తప్పని విశ్వాస పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహిమా, జూలై 18: మైనార్టీలో పడ్డ నాగాలాండ్ ముఖ్యమంత్రి షుర్హోజిలి లిజిత్సు ప్రభుత్వ భవితవ్యం బుధవారం తేలబోతోంది. బలపరీక్ష ను ఎదుర్కోవాలంటూ గవర్నర్ పిబి ఆచార్య జారీ చేసిన ఆదేశంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేద ని గౌహతి హైకోర్టు కోహిమా బెంచి న్యాయమూర్తి ఎల్‌ఎమ్ జమీర్ మంగళవారం స్పష్టం చేశారు. దీనిపై స్టే ఇవ్వాలంటూ లిజిత్సు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించారు. దాంతో బలపరీక్ష కోసం బుధవారం ఉద యం తొమ్మిదిన్నరకు నాగాలాండ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. లిజిత్సు ప్రభుత్వం మైనార్టీలో పడిందని, తనకే 43మంది అధికార పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందం టూ మాజీ సిఎం టిఆర్ జెలియాంగ్ ఇప్పటికే గవర్నర్‌కు స్పష్టం చేశారు. నలుగురు బిజెపి ఎమ్మెల్యేలూ ఆయనకు మద్దతు పలికారు. బలపరీక్షకు ముందుగానే లిజిత్సు రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.