జాతీయ వార్తలు

అభినందనల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: ఎన్డీయే తరపున ఉపరాష్టప్రతి అభ్యర్థిగా ఎంపికైన ఎం.వెంకయ్య నాయుడికి అభినందనలు వెల్లువెత్తాయి. మంగళవారం వెంకయ్యనాయుడు నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు వెంకయ్య మాజీ ప్రధాని వాజపేయి నివాసానికి వెళ్లి ఆయన అశీస్సులు తీసుకున్నారు. అలాగే బిజెపి అగ్రనాయకులు ఎల్.కె.అద్వానీ, మురశీ మనోహర్ జోషిని స్వయంగా కలిసి వారి దీవెనలు అందుకున్నారు. ఉదయం నుంచి వెంకయ్య నివాసానికి పలు రాష్ట్రాల ఎంపీల రాకతో సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన టిఆర్‌ఎస్, టిడిపి, వైస్సార్ కాంగ్రెస్ ఎంపీలు వెంకయ్యను కలిసి అభినందనలు తెలిపారు. టిఆర్‌ఎస్ ఎంపీలు కవిత, కె.కేశవరావు, వినోద్ కుమార్, జితేందర్ రెడ్డి, టిడిపి ఎంపీలు కేశినేని నాని, మురళీ మోహన్, టి.జి.వెంకటేశ్, మాగంటి బాబు, కొనగళ్ల నారాయణ, అవంతి శ్రీనివాస్, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుక, విజయ సాయిరెడ్డి తదితరులు వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరి, తదితరులు వెంకయ్యను కలిశారు. బిజెపి ఎంపీలు గోకరాజు గంగరాజు, కంభంపాటి హరిబాబులతోపాటు బిజెపికి చెందని పలువురు ఎంపీలు అభినందనలు తెలిపారు.

చిత్రం.. ఉపరాష్టప్రతి అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ వేసేందుకు వస్తున్న వెంకయ్య నాయుడు. ఆయనతోపాటే వస్తున్న ప్రధాని మోదీ, అద్వానీ, అమిత్ షా తదితరులు