జాతీయ వార్తలు

సముద్ర గర్భంలో మరో ప్రపంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: కొన్ని సందర్భాల్లో చేపట్టే అనే్వషణలు కొత్త ఆవిష్కరణలకు సరికొత్త ప్రపంచాలు కళ్లకు కట్టడానికి దారితీస్తాయి. మూడేళ్ల క్రితం మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం 239మంది ప్రయాణికులతో గల్లంతయింది.
దానికోసం సముద్ర మట్టానికి వెళ్లి మరీ ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా శోధించాయి. తమ శాస్తస్రాంకేతిక విజ్ఞానాన్ని జోడించడంతోపాటు ఆధునిక పరికరాలను కూడా ఎంహెచ్370 అనే ఈ విమానం ఆచూకీ కనుగొనేందుకు వినియోగించాయి. కానీ విమానం జాడగానీ, అందులోని ప్రయాణికు లు ఏమయ్యారన్న ఆచూకీ గానీ తెలియనప్పటికీ, ఈ శోధనలో సముద్రలోతుల్లో ఓ అద్భుతమైన ప్రపంచమే వెలుగుచూసింది. హిందూ మహాసముద్రం దక్షిణ ప్రాంతంలో ఈ విమా నం ఆచూకీ తెలిసే అవకాశం ఉందని స్పష్టమైన సంకేతాలు అందడంతో ఆ ప్రాంతంలోనే సముద్ర లోతుల్లోకి వెళ్లి మరీ శోధనలు చేశా రు. ఆ ప్రయత్నంలోనే ఇప్పటివరకు అంతు బట్టని సముద్రగర్భ ప్రపంచం వెలుగుచూసింది. ఆధారాల ప్రకారం సముద్ర లోతుల్లో ఏ రకమైన అద్భుతాలు ఉండే అవకాశం ఉందన్న దానిపై తదుపరి పరిశోధనలు జరిపే అవకాశం ఉంటుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.