జాతీయ వార్తలు

కొత్త రాష్టప్రతి కోవింద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 20: అందరు ఊహించినట్లే దేశం పద్నాల్గవ రాష్టప్రతిగా బిహార్ మాజీ గవర్నర్, దళిత నాయకుడు రామ్‌నాథ్ కోవింద్ భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. కేంద్రంలో మొదటిసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బిజెపి తన పార్టీ సొంత నాయకుడిని రాష్టప్రతి పదవికి ఎంపిక చేసుకోవటంలో ఘన విజయం సాధించింది. తమకు పూర్తి మెజారిటీ ఉన్నందున పూర్తి స్థాయి బిజెపి నాయకుడిని మాత్రమే రాష్టప్రతి భవన్‌కు పంపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించటం తెలిసిందే. రామ్‌నాథ్ కోవింద్ భారత పద్నాల్గవ రాష్టప్రతిగా ఎన్నికైనట్లు రాష్టప్రతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. బిజెపి మిత్రపక్షాల అభ్యర్థిగా రంగంలోకి దిగిన రామ్‌నాథ్ కోవంద్‌కు రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఓట్లు పడ్డాయి. ఈ ఓట్ల మొత్తం విలువ ఏడు లక్షల రెండు వేల నలభై నాలుగు. ఇది మొత్తం ఓట్లలో 65.65 శాతం. కాంగ్రెస్ మిత్రపక్షాల అభ్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌కు ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై నాలుగు ఓట్లు లభించాయి. ఈ ఓట్ల మొత్తం వీలువ మూడు లక్షల అరవై ఏడు వేల మూడు వందల పద్నాలుగు. ఇది 34.35 శాతం. 77 ఓట్లు చెల్లకుండాపోయాయి. చెల్లని ఓట్ల మొత్తం వీలువ 20,942. గురువారం ఉదయం పదకొండు గంటలకు పార్లమెంటు ఆవరణలోని 62 నంబర్ గదిలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుండి రామ్‌నాథ్ కోవింద్ మెజారిటీ కొనసాగింది. మొదట పార్లమెంటు సభ్యుల ఓట్ల లెక్కింపు జరిగింది.అనంతరం ఆంధ్రప్రదేశ్ ఓట్ల లెక్కింపు జరిగింది. ఆంధ్ర ప్రదేశ్‌లో మీరాకుమార్‌కు ఒక్క ఓటు కూడా పడలేదు. ఢిల్లీ శాసన సభ ఓట్ల లెక్కింపు జరిగినప్పుడు పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభ్యులు రామ్‌నాథ్ కోవింద్‌కు ఓటు వేసినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రతిపక్ష సభ్యులు కోవింద్‌కు అనుకూలంగా ఓటు వేయటం వల్లనే ఆయన మొత్తం ఓట్ల సంఖ్య బాగా పెరిగింది. బిజెపి అధినాయకత్వం వేసిన అంచనా ప్రకారం రామ్‌నాథ్ కోవింద్‌కు దాదాపు ఆరవై ఐదు శాతం ఓట్లు పడాలి. అయితే ప్రతిపక్షం సభ్యులు కూడా అధికార అభ్యర్థికి ఓటు వేయటం వలన మీరాకుమార్ మొత్తం ఓట్ల శాతం తగ్గింది. కోవింద్‌కు బిహార్ ముఖ్యమంత్రి,జెడియు అధ్యక్షుడు నితీష్‌కుమార్ మద్దతు ప్రకటించటంతో మీరాకుమార్ ఓట్లు మరింత పడిపోవటం తెలిసిందే. నితీష్‌కుమార్ అధికార పక్షంవైపు మొగ్గటంతో ప్రతిపక్షం ఓట్లు బాగా చీలిపోయాయి. దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్‌ఆర్‌సిపి, బిజెడి, అన్నాడిఎంకెలోని రెండు వర్గాలు, పలు ఇతర పార్టీలు కోవింద్‌కు అనుకూలంగా ఓటు వేయటంతో ప్రతిపక్షం అభ్యర్థి మీరాకుమార్ భారీ తేడాతో ఓటమిపాలయ్యింది. నితీష్‌కుమార్ అధికార పక్షానికి మద్దతు ప్రకటించటం, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిపక్ష పార్టీల్ని కూడగట్టేందుకు అమలు చేసిన వ్యూహం దెబ్బతినటమే కాకుండా విపక్షాల్లో ఐక్యత కూడా నీరుకారిపోయింది. జెడియు మూలంగా ప్రతిపక్షం బలం తగ్గటం అధికార, ప్రతిపక్షం అభ్యర్థులకు లభించిన ఓట్లు స్పష్టం చేస్తున్నాయి.
25న ప్రమాణం
పద్నాల్గవ రాష్టప్రతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్ 25న పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో పదవి, గోపనీయత ప్రమాణం చేస్తారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కేహర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. భారీ మెజారిటీతో విజయం సాధించిన కోవింద్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, బిజెపి ఉపరాష్టప్రతి అభ్యర్థి, మాజీ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పలువురు ప్రతిపక్షం నాయకులు అభినందించారు. పలువురు మంత్రులు రామ్‌నాథ్ కోవింద్ వద్దకు వ్యక్తిగతంగా అభినందించటం గమనార్హం.