జాతీయ వార్తలు

రాజ్యాంగ పరిరక్షణ నా ప్రాథమిక బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 20: మాజీ రాష్టప్రతులు బాబు రాజేంద్రప్రసాద్, డాక్టర్ రాధాకృష్ణన్, డాక్టర్ అబ్దుల్ కలాం, ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చూపిన బాటలో ముందుకు సాగుతూ దేశంలోని దళిత,బడుగు,బలహీన వర్గాల ప్రతినిధిగా రాష్టప్రతి భవన్‌లో ఉంటానని దేశం పద్నాల్గవ రాష్టప్రతిగా ఎన్నికైన రామ్‌నాథ కోవింద్ ప్రకటించారు. సర్వోత్తమ రాష్టప్రతి పదవి ప్రతిష్టను మరింత పెంచేందుకు అన్ని విధాల కృషి చేస్తానని తెలిపారు. రాష్టప్రతిగా ఎన్నికైన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ‘నాలాంటి రామ్‌నాథ్ కోవింద్‌లు దేశంలో కోకొల్లలు.రాష్టప్రతిగా వారందరికి ప్రాతినిధ్యం వహిస్తానని’ ఆవేశంతో చెప్పా రు. భారత రాజ్యాంగం అన్నింటకంటే ఉన్నతమైనదని, రాజ్యాంగం పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రకటించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించటం తన ప్రాథమిక బాధ్యత అని ఉద్ఘాటించారు. రాష్టప్రతి పదవి పార్టీ రాజకీయాలకు అతీతమైందన్నారు. దేశం సర్వతోముఖాభివృద్ధి, యువత ఆకాంక్షలను పూర్తి చేయటం, వారికి ఆధునిక విద్యా సౌకర్యాలు కల్పించటం అత్యంత ముఖ్యమన్నారు. త్వరలోనే దేశ స్వాతంత్రం 75వ వార్షికోత్సవాలను జరుపుకోనున్నామని గుర్తు చేసిన కోవింద్ ‘ఈ నేపథ్యంలో దేశం అనుక్షణం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి.ఈ లక్ష్య సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తానని’దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదన్నారు. రాష్టప్రతి పదవి పార్టీ రాజకీయాలకు అతీతమని పేర్కొన్న ఆయన తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ పార్టీలతోపాటు తనకు ఓటు వేసిన ఇతర పార్టీల సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.