జాతీయ వార్తలు

డోక్లామ్‌పై మాకే మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 20: సిక్కిం సెక్టార్‌లోని ట్రై జంక్షన్ విషయంలో భారత దేశం వ్యవహరించిన తీరును ప్రపంచ దేశాలు సమర్థిస్తున్నాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటించారు. సిక్కిం సెక్టార్‌లో మామూలు పరిస్థితులు నెలకొనాలంటే భారత దేశంతోపాటు చైనా కూడా తన సైనికులను ఉపసంహరించుకోవలసి ఉంటుందని గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో తెగేసి చెప్పారు.్భటాన్ కోసం భారత సైనికులు డోక్లామ్ వద్ద తమ భూభాగంలోకి వచ్చారంటూ చైనా చేస్తు న్న వాదనలో నిజం లేదని ప్రకటించారు. ఈ ప్రాంతంలో చైనా ఏకపక్షంగా పక్కా రోడ్డు నిర్మాణం చేపట్టం ద్వారా దీని భౌగోళిక యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిందన్నారు. చైనా చర్య వల్ల భారత భద్రతకు ముప్పు వాటిల్లుతుంది కాబట్టే ఆ రహదారి నిర్మాణాన్ని అడ్డుకోవలసి వచ్చిందని వివరించారు. భూటాన్ కోసమే భారత సైనికులు చైనా భూభాగంలోకి వెళ్లారనటం ఎంత మాత్రం నిజం కాదని, భారత దేశం భద్రతకు ముప్పువాటిల్లే పరిస్థితులు నెలకొన్నందునే భారత సైన్యం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. పంచశీల్ సిద్ధాంతం ఇప్పుడూ అమలవుతోందని, భారత-చైనా, చైనా-్భటాన్ సరిహద్దులు ఇంకా ఖరారు కావలసి ఉన్నదని సుష్మ తెలిపారు. ప్రత్యేక ప్రతినిధులను ఏర్పాటు చేసుకోవటం ద్వారా సరిహద్దు సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉభయ దేశాలూ ప్రయత్నిస్తున్నాయని గుర్తు చేశారు.ట్రై జంక్షన్ విషయంలో భారత,చైనాల మధ్య గతంలోనే ఒక ఒప్పందం కుదిరిందని, చైనా,్భరత్, భూటాన్ దేశాలు పరస్పర చర్చల ద్వారా ట్రై జంక్షన్ సమస్యను పరిష్కరించుకోవాలని పేర్కొన్న ఆమె ‘ భారత్ చైనాల మధ్య కుదిరిన ఒప్పందంలోని 13వ పేరా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది’అని గుర్తు చేశారు. ఏక పక్షంగా ట్రై జంక్షన్ వరకు పక్కా రోడ్డు నిర్మాణం చేపట్టటం ద్వారా చైనా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నారు. పక్కా రోడ్లు, కచ్చా రోడ్లు, మామూలు రోడ్ల నిర్మాణం పేరుతో గతంలో కూడా చైనా ఈ రకమైన ఉల్లంఘనలకు పాల్పడిందని గుర్తు చేశారు. ఈసారి ఏకంగా బుల్‌డోజర్లు, ఎక్స్‌కవేటర్లు, ఇతర భారీ సామాగ్రితో వచ్చి పక్కా రోడ్డు నిర్మాణం చేపట్టింది కాబట్టే భారత జోక్యం చేసుకోవలసి వచ్చిందన్నారు. బంగ్లా ద్వారా ట్రై జంక్షన్ వరకు పక్కా రోడ్డు నిర్మాణం చేయాలన్నది చైనా ముఖ్య ఉద్దేశ్యమన్నారు. పక్కా రోడ్డు నిర్మాణం ద్వారా ఏకపక్షంగా స్టేటస్ కోను మార్చేందుకు ప్రయత్నించినందునే భారత్ జోక్యం అనివార్యమైందని చెప్పారు. చైనా-్భటాన్‌ల మధ్య వివాదం కొనసాగినంత కాలం భారత సైన్యం జోక్యం చేసుకోలేదని గుర్తు చేశారు. ట్రై జంక్షన్ పాయింట్ రాగానే భారత దేశం ప్రయోజనాల గురించి ఆలోచించాల్సి వస్తోందని, రోడ్డు నిర్మాణం జరిగితే ట్రై జంక్షన్ వద్ద స్టేటస్ కో దానంతటదే మారిపోతుందని సుష్మ పేర్కొన్నారు. ఇదే జరిగితే భారత ప్రయోజనాలు దెబ్బ తింటాయని, దేశ భద్రతకు సవాల్‌గా మారుతుందని ఆమె వివరించారు. భారత్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని చైనా డిమాండ్ చేస్తోందని గుర్తు చేసిన సుష్మ ‘రెండు దేశాలూ తమ సైనికుల్ని ఉపసంహరించుకోవాలన్నదే మా వాదన’అని వివరించారు. చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారానికి ఉభయ దేశాలూ పరస్పరం సైనికుల్ని ఉపసంహరించుకోవడమొక్కటే మార్గమని తెగేసి చెప్పారు.