జాతీయ వార్తలు

గోప్యత హక్కును నిర్వచించేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: గోప్యతాహక్కు ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తుందా రాదా అన్న అంశంపై వరుసగా రెండోరోజైన గురువారం కూడా సుప్రీం కోర్టు బెంచి వాదోపవాదాలను కొనసాగించింది. ఇందుకు సంబంధించి ఎన్నో కీలకమైన ప్రశ్నలను సంధించింది. డిజిటల్ యుగంలో వ్యక్తిగత వివరాలను ఇటు ప్రభుత్వాలు, అటు ప్రైవేటు సంస్థలు పంచుకుంటున్న నేపథ్యంలో ప్రైవసీకి సంబంధించిన అంశాల తీరుతెన్నుల్ని నిర్వచించాల్సిన అవసరం ఉందని తెలిపింది. వ్యక్తిగత వివరాలను చట్ట పరంగా, చట్ట వ్యతిరేకంగా ఉపయోగించుకునే పరిస్థితులు ఉన్నప్పుడు ప్రైవసీ హక్కును ఏ విధంగా నియంత్రించ గలుగుతామో..అమలు చేయగలుగుతామో తెలియజేయాలని కోరింది. మోబైల్ ఫోన్లను కొనేందుకు ప్రతి ఒక్కరూ తమంతటతాముగానే వేలి ముద్రలు ఇస్తున్నారని, ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రైవసీని ప్రభుత్వానికి, ప్రైవేటు సంస్థలకు అప్పగించడమేనని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.‘దీని అర్థం రాజ్యాంగ లేదా వ్యక్తిగత హక్కుల్ని అప్పగించడమేనా..’అని ప్రశ్నించింది.
వేలి ముద్రతో ఐ-పాడ్‌ను తెరిచినప్పుడు మనకు తెలియకుండానే అవి జనంలోకి వెళ్లిపోతుందని పేర్కొన్న తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ‘డిజిటల్ ప్రపంచంలో గోప్యత హక్కును ఏ విధంగా నిర్వచించగలుగుతాం’అని పేర్కొంది. ఇంటర్‌నెట్ యుగంలో ప్రైవసీ పరిధి ఎంతో విస్తరించిందని తెలిపిన సుప్రీం కోర్టు వ్యక్తిగత వివరాల గోప్యతను అనధికార వ్యక్తులు ఉల్లంఘిస్తే బాధిత వ్యక్తికి అందుబాటులో ఉండే మార్గాంతరమేమిటని ప్రశ్నించింది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత వివరాలు భద్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది. ‘మీ హక్కును ప్రైవేటు వ్యక్తులు ఉల్లంఘించారు కాబట్టి..మేమేమీ చేయలేమని ప్రభుత్వం చేతులెత్తేయడానికి వీల్లేదు’అని చీఫ్ జస్టిస్ కేహర్ సారథ్యంలోని బెంచి స్పష్టం చేసింది. ప్రైవసీ హక్కు ప్రాథమిక హక్కులతో ముడివడి ఉందని, దీన్ని ఉల్లంఘించడానికి ఎంత మాత్రం వీల్లేదని సీనియర్ న్యాయవాదులు అరవింద్ దాటర్, ఆనంద్ గ్రోవర్, మీనాక్షీ అరోరాలు స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు దీన్ని ఉల్లంఘించకుండా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు.