జాతీయ వార్తలు

మాయావతి రాజీనామా ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: బిఎస్పీ అధినేత్రి రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను చైర్మన్ హమిద్ అన్సారీ ఆమోదించినట్లు రాజ్యసభకు చెందిన ఉన్నతాధికారి ఒకరు గురువారం చెప్పారు. నిర్ణయించిన ఫార్మాట్ ప్రకారం మాయావతి కొత్తగా చేతిరాతతో ఏకవాక్యంలో ఉండే రాజీనామా లేఖను సమర్పించినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లో దళితులపై జరుగుతున్న దాడులను సభలో లేవనెత్తడానికి బిజెపి, రాజ్యసభ చైర్మన్ అనుమతించడం లేదని ఆరోపిస్తూ మాయావతి బుధవారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే మూడు పేజిలుండే ఆ రాజీనామా నిర్ణీత ఫార్మాట్‌లో లేని కారణంగా దాన్ని తిరస్కరించారు. రాజీనామా లేఖ క్లుప్తంగా ఉండాలని, ఎలాంటి కారణాలను పేర్కొనరాదని నిబంధనలు పేర్కొంటున్నాయి. మాయావతి రాజ్యసభ సభ్యత్వం గడువు మరో ఆరునెలల్లో ముగియనున్న నేపథ్యంలో ఆమె రాజీనామా చేయడం వెనుక తన దళిత ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవాలన్న ఆలోచన ఉందని అంటున్నారు. గత ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ప్రముఖ దళిత నాయకురాలిగా తన స్థానాన్ని పదిలం చేసుకోవాలనే ఆలోచన కూడా ఈ రాజీనామా వెనుక ఉందని అంటున్నా రు. కాగా మాయావతి రాజ్యసభ సన్య త్వం గడువు మరో ఆరు నెలల్లో ఎలాగూ ముగియనుండగా ఇప్పుడు ఆమె రాజీనామా చేయడం డ్రామా తప్ప మరోటి కాదని బిజెపి అంటోంది.