జాతీయ వార్తలు

కళాత్మకతకు ప్రతీక రాష్టప్రతి భవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: దేశ 14వ రాష్టప్రతి ఎన్నిక ప్రక్రి య తుది దశకు చేరుకొని రామ్‌నాథ్ కోవింద్ కొత్త అధ్యక్షుడిగా రాష్టప్రతి భవన్‌లో అడుగుపెట్టనున్న తరుణంలో రాష్టప్రతి అధికార నివాసమైన రాష్టప్రతి భవన్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను గుర్తు చేసుకోవడం ఎంతో సముచితంగా ఉంటుంది. న్యూఢిల్లీలో ఉన్న రాష్టప్రతి భవన్ దేశంలో అత్యంత కళాత్మక కట్టడాల్లో ఒకటని చెప్పవచ్చు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతల అధికార నివాసాలన్నిటిలోకి అత్యంత అద్భుతమైన వాటిలో ఒకటిగా కూడా దీనికి గుర్తింపు ఉంది.
ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌గా కూడా పిలిచే రాష్టప్రతి భవన్ ఇటలీ రాజధాని రోమ్‌లోని క్విరినల్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద అధ్యక్ష భవనం. సర్ ఎడ్విన్ లుట్యెన్స్ అనే బ్రిటీష్ ఆర్కిటెక్ట్ ఈ భవనానికి రూపకల్పన చేశారు. చీఫ్ ఇంజనీర్ కీలింగ్, చాలామంది భారతీయ కాంట్రాక్టర్లు కూడా ఈ భవనం డిజైనింగ్, నిర్మాణంలో పాలు పంచుకున్నారు. 1912లో ఈ భవన నిర్మాణం ప్రారంభం కాగా 1929లో నిర్మాణం పూర్తయింది. నిర్మాణం పూర్తి కావడానికి 17 ఏళ్లు పట్టగా, దాదాపు 29 వేల మంది దీని నిర్మాణంలో పాలు పంచుకొన్నారు. 1931 సంవత్సరంలో దీన్ని అధికారికంగా ప్రారంభించారు. నిర్మాణ కౌశల్యానికి మారుపేరుగా నిలిచే ఈ అద్భుత కట్టడం నిర్మాణానికి అయిన మొత్తం వ్యయం అప్పటి లెక్కల ప్రకారం 8,77,136 పౌండ్లు. అంటే భారతీయ కరెన్సీలో కోటీ 28 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. మొత్తం 2 లక్షల చదరపు అడుగుల వైశాల్యం కలిగిన రాష్టప్రతి భవన్‌లో నాలుగు అంతస్తులు, 340 గదులున్నాయి. అతిథులకోసం అదనపువసతితో పాటుగా 54కు పైగా బెడ్‌రూమ్‌లుండడాన్ని బట్టే ఈ భవనం ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. రాష్టప్రతి భవన్‌ను నిర్మాణం కోసం 70 కోట్ల ఇటుకలు, మూడు మిలియన్ ఘనపుమీటర్లకు పైగా రాళ్లు ఉపయోగించినట్లు చెప్తారు. అన్నిటికన్నా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ భవనం నిర్మాణంలో ఎక్కడా స్టీల్‌ను ఉపయోగించలేదు.
1050లో ఇది భారత వైస్రాయ్ నివాసంగా ఉండేది. అందువల్ల అప్పట్లో దీన్ని వైస్రాయ్ హౌస్‌గా పిలిచే వారు. సర్ లుట్యెన్స్ డిజైన్ చేసిన వాటన్నిటిలోకి ఇదే అత్యుత్తమ కళాత్మక నిర్మాణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొగలాయి, బ్రిటీష్ వాస్తుశాస్త్రాల కలబోత అయిన రాష్టప్రతి భవన్ దేశంలోనే అద్భుత కట్టడాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ భవనంలో మొట్టమొదట అడుగుపెట్టింది లార్డ్ ఇర్వింగ్.
రాష్టప్రతి భవన్ మెయిన్ బిల్డింగ్‌కు పశ్చిమంగా సువిశాలమైన మొగల్ గార్డెన్ ఉంది. ఈ గార్డెన్‌ను కూ డా సర్ ల్యుటెనే డిజైన్ చేశారు. చూడగానే ఆకట్టుకొనే ఈ సుందరమైన ఉద్యానవనంలో రకరకాల పూలమొక్కలు, పొదలు, కళాత్మకత ఉట్టిపడే పలు ఫౌంటెన్లు వీక్షకులను కట్టిపడేస్తాయి. ఈ గార్డెన్‌లో అనేక రకాల గులాబీలతో పాటుగా లెక్కలేనన్ని అందమైన పూల మొక్కలున్నాయి. గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల మధ్య దీన్ని సామాన్యుల సందర్శన కోసం తెరిచి ఉంచుతారు.