జాతీయ వార్తలు

ప్రాంతీయ భాషల్లో నీట్‌ను పరిశీలిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: తెలుగు, తమిళం, మలయాళం,అస్సాం,బెంగాలీ, గుజరాత్ భాషల్లో ఎమ్‌బిబిఎస్, బిడిఎస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్త ధర్మాసనాన్ని ఏర్పా టు చేస్తామని తెలిపింది. 2016-17 సంవత్సరానికి గాను ఈ ఆరు ప్రాంతీ య భాషల్లో వైద్య, డెంటల్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ కోర్టుకు నివేదించారు. న్యాయమూర్తి ఎఆర్ దావే సారథ్యంలోని బెంచికి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నీట్‌ను నిర్వహించాలని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్షను నిర్వహించే అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని రంజిత్ కుమార్ తెలిపారు.న్యాయమూర్తులు శివకీర్తి సింగ్, ఎకె గోయల్‌లతో కూడిన ఈ త్రిసభ్య ధర్మాసనం త్వరలోనే కేంద్ర విన్నపాన్ని పరిశీలిస్తామని తెలిపింది. నీట్‌ను ఇంగ్లీషు, హిందీ భాషల్లోనే నిర్వహించడం వల్ల గ్రామీణ విద్యార్థులు నష్ట పోతారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు వివరించారు. దీనికి స్పందించిన సిబిఎస్‌ఇ న్యాయవాది పింకీ ఆనంద్ ‘ప్రాంతీయ భాషల్లో నీట్‌ను నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’అని స్పష్టం చేశారు. ప్రస్తుత సంవత్సరానికి గాను నీట్ నుంచి తమకు మినహాయింపునివ్వాలని గుజరాత్ తరపు న్యాయవాది తుషారా మెహతా కోర్టును అభ్యర్థించారు. రాష్ట్రాలు నిర్వహించే పరీక్షల్లో నెగిటివ్ మార్కులు ఉండవని, నీట్ పరీక్షలో ఇవి ఉండటం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని వివరించారు.