జాతీయ వార్తలు

చెల్లని ఓట్లు 77!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: సాధారణంగా ఎన్నికల్లో ఓటరు అజ్ఞానం కారణంగానో, లేదా చిన్న చిన్న తప్పిదాల కారణంగా ఓట్లు చెల్లక పోవడం సహజంగా జరుగుతూ ఉం టుంది. అయితే లక్షలాది మందికి ప్రాతినిధ్యం వహించే ప్రజా ప్రతినిధులు వేసే ఓటు కూడా చెల్లలేదంటే ఏమనుకోవాలి? తాజాగా జరిగిన రాష్టప్రతి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మొత్తం 77 ఓట్లు చెల్లకపోగా, అందులో 21 ఓట్లు ఎంపిలవే కావడం గమనార్హం. మొత్తం 21 మంది ఎంపీలు, 56 మం ది ఎమ్మెల్యేల ఓట్లు చెల్లలేదని, వాటి మొత్తం విలువ 20,942 అని అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల కమిషన్, వివిధ రాజకీయ పార్టీలు రాష్టప్రతి ఎన్నికల్లో ఎలా ఓటు వేయాలో తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎంతో అవగాహన కల్పించి, మాక్ ఓటింగ్ నిర్వహించి శిక్షణ ఇచ్చినప్పటికీ వారు తప్పులు చేయడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. గత ఎన్నికలతో పోలిస్తే తగ్గాల్సిన చెల్లని ఓట్ల సంఖ్య పెరగడం అందరినీ ఆలోచించేలా చేస్తోంది. 2012 రాష్టప్రతి ఎన్నికల్లో మొత్తం 69 ఓట్లు చెల్లకపోగా, అందు ల్లో 15 ఎంపీల ఓట్లు. కాగా, ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగింది. అలాగే 1997 రాష్టప్రతి ఎన్నికల్లో 171 ఓట్లు చెల్లకపోగా, వాటిలో 32 ఎంపీల ఓట్లు ఉన్నాయి. 2002లో ఆ సంఖ్య 174కు పెరగ్గా, అందుల్లో 41 ఓట్లు ఎంపీలవే ఉన్నా యి. పశ్చిమ బెంగాల్‌లో అత్యధిక సంఖ్యలో పది మంది ఎమ్మెల్యేలు వేసిన ఓట్లు చెల్లలేదు. ఢిల్లీలో ఆరుగురు ఎమ్మెల్యేల ఓట్లు చెల్లలేదు. బహుశా వీరంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే చెందిన వారై ఉంటారని భావిస్తున్నారు. కర్నాటకలో ముగ్గురు, ఏపిలో ముగ్గురు ఎమ్మెల్యేల ఓట్లు చెల్లలేదు. అయితే దక్షిణాది రాష్ట్రాలయిన కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం చెల్లని ఓటు ఒక్కటీ లేదు.