జాతీయ వార్తలు

రాష్ట్రాల్లో ఎవరికెన్ని?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: భారత నూతన రాష్టప్రతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 771 మంది ఎన్నికయిన పార్లమెంటు సభ్యులు పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్సులు కాగా, ఈ నెల 17న జరిగిన ఓటింగ్‌లో 768 మంది ఎంపీలు ఓటు వేశారు. కాగా, మొత్తం 4,109 మంది ఎమ్మెల్యేల్లో 4,083 మంది ఓట్లు వేశారు. ఎంపీలలో 522 మంది రామ్‌నాథ్ కోవింద్‌కు ఓటు వేయగా, 225 మంది ఎంపీలు ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌కు ఓటు వేశారు. రాష్ట్రాల వారీగా ఇరువురు అభ్యర్థులకు వచ్చిన వచ్చిన ఓట్ల వివరాలను పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో కోవింద్‌కు 171 ఓట్లు (ఓట్ల విలువ 27,189) రాగా మీరా కుమార్‌కు ఒక్క ఓటు కూడా రాలేదు. మూడు ఓట్లు చెల్లలేదు. అరుణాచల్‌ప్రదేశ్‌లో కోవింద్‌కు 56 ఓట్లు(ఓట్ల విలువ 448) రాగా, మీరాకుమార్‌కు 3 ఓట్లు(ఓట్ల విలువ 24) లభించాయి. అసోంలో కోవింద్‌కు 91 ఓట్లు(ఓట్ల విలువ 10,556), రాగా, మీరాకుమార్‌కు 109 ఓట్లు (ఓట్ల విలువ 18,857) వచ్చాయి. చత్తీస్‌గఢ్‌లో కోవింద్‌కు 52(6,708), మీరాకుమార్‌కు 35(4,515) ఓట్లు వచ్చాయి. మూడు ఓట్లు చెల్లలేదు. గోవాలో కోవింద్‌కు 25 ఓట్లు(550), మీరాకుమార్‌కు 11 ఓట్లు(220) వచ్చాయి. రెండు ఓట్లు చెల్లలేదు. కాగా, ప్రధాని సొంత రాష్టమ్రైన గుజరాత్‌లో కోవింద్‌కు 132 ఓట్లు (19,404) ఓట్లు రాగా, మీరాకుమార్‌కు 49 ఓట్లు( 7,203) వచ్చాయి. అలాగే హర్యానాలో కోవింద్‌కు 73(8,176) ఓట్లు, మీరాకుమార్‌కు 16(1792) ఓట్లు వచ్చా యి. ఒక ఓటు చెల్లలేదు. హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం కోవింద్‌కు 30 ఓట్లు (1530) రాగా ఆయన ప్రత్యర్థి మీరాకుమార్‌కు 37 ఓట్లు( 1887) వచ్చాయి. జమ్మూ, కాశ్మీర్‌లో 57 ఓట్లు (4032) కోవింద్‌కు, మీరాకుమార్‌కు 13 (2160) ఓట్లు వచ్చాయి. జార్ఖండ్‌లో కోవింద్‌కు 51 ఓట్లు (8,976), మీరాకుమార్‌కు 26 (4,576) ఓట్లు వచ్చాయి. నాలుగు ఓట్లు చెల్లలేదు. రిటర్నింగ్ అధికారి అనూప్ మిశ్రా ఈ వివరాలను వెల్లడించారు.