జాతీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఓట్లు కోవింద్‌కే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 20: రాష్టప్రతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి మెజారిటీ లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 మంది శాసన సభ్యులుంటే భూమానాగిరెడ్డి మరణణ వలన ఒక ఖాళీ ఏర్పడింది. దీనితో ఏపిలో మొత్తం ఓట్ల సంఖ్య 174కాగా, ఇందులో నుండి రామ్‌నాథ్ కోవింద్‌కు 171 ఓట్లు పడ్డాయి. వీటి మొత్తం వీలువ 27,189. నాలుగు వందల డెబ్బై ఏడు విలువ ఉన్న మూడు ఓట్లు చెల్లకుండాపోయాయి. ప్రతిపక్షాల అభ్యర్థి మీరాకుమార్‌కు అంధ్రప్రదేశ్‌లో ఒక్క ఓటు కూడా పడలేదు. తెలంగాణలో మొత్తం శాసన సభ్యుల సంఖ్య 119 కాగా రెండు ఖాళీల మూలంగా ఓట్ల సంఖ్య 117కు తగ్గింది. ఇందులో నుండి ప్రతిపక్ష అభ్యర్థి మీరాకుమార్‌కు రెండు వేల ఆరు వందల నలభై విలువతో కూడిన ఇరవై ఓట్లు లభించాయి. 12,804 విలువ ఉన్న 97 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు లభించాయి.