జాతీయ వార్తలు

వాళ్లకు మద్దతివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: గో సంరక్షణ పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవాళ్లను సమర్థించొద్దని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. అంతేకాదు గో సంక్షరణ పేరిట సాగుతోన్న హింసాత్మక ఘటనలపై వైఖరేమిటో చెప్పాలని కూడా సుప్రీంకోర్టు కేంద్రం, రాష్ట్రాలను కోరింది. కాగా, శాంతి భద్రతలు రాష్ట్రాలకు సంబంధించిన అంశమని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనానికి కేంద్రం తెలియజేస్తూ, అయితే దేశంలో గోరక్షణ పేరిట సాగుతోన్న దాడులను
ప్రభుత్వం ఎంతమాత్రం సమర్థించదని స్పష్టం చేసింది. ‘శాంతి భద్రతలు రాష్ట్రాలకు సంబంధించిన అంశం. రాష్ట్రాలు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాయని మీరు చెప్తున్నారు. అలాంటప్పుడు గోరక్షణ పేరుతో చట్టాల్ని చేతుల్లోకి తీసుకునే వారిని మీరు కాపాడొద్దు’ అని న్యాయమూర్తులు ఎఎం ఖన్వలికర్, ఎంఎం శంతనగౌడర్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. సామాజిక మాధ్యమాల్లో ఉంచిన గో సంరక్షణకు సంబంధించిన హింసాత్మక ఘటనల సమాచారాన్ని తొలగించడంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని సైతం ధర్మాసనం కోరింది. కాగా ‘శాంతిభద్రతలు రాష్ట్రాలకు సంబంధించిన అంశం. కేంద్రానికి అందులో ఎలాంటి పాత్ర లేదు. అయినప్పటికీ చట్ట ప్రకారం చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ఈ వర్గానికి దేశంలో స్థానం లేదని కేంద్రం అభిప్రాయపడుతోంది. గో సంరక్షణ పేరుతో ప్రైవేటు వ్యక్తులు మనుషులపై దాడులు చేయడాన్ని కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోను సమర్థించదు’ అని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ చెప్పారు. అలాగే, గోసంరక్షణ పేరుతో హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకొన్నట్టు బిజెపి పాలిత రాష్ట్రాలైన గుజరాత్, జార్ఖండ్ తరఫు న్యాయవాది చెప్పారు. ధర్మాసనం వారి వాదనలను రికార్డు చేసిన అనంతరం హింసాత్మక ఘటనలపై నాలుగు వారాల్లోగా తమ సమాధానాలను దాఖలు చేయాలని కేంద్రం, మిగతా రాష్ట్రాలను ఆదేశిస్తూ, కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది.