జాతీయ వార్తలు

ఒక టిఎంసి ఇస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు మంచి నీరు అందించేందుకు నారాయణపూర్ జలాశయం నుంచి జూరాల జలాశయానికి ఒక టిఎంసి నీటిని విడుదల చేస్తామని కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధుల బృందానికి హామీ ఇచ్చారు. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి సారథ్యంలో సిఎల్‌పి నేత కె. జానారెడ్డి, శాసనమండలిలో విపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డికె అరుణ, వంశీచంద్ రెడ్డి, సంపత్‌కుమార్ తదితరులు మంగళవారం బెంగళూరు వెళ్ళి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసారు. గొంతెండి పొతున్న పాలమూరు ప్రజలకు రెండు టిఎంసిల నీటిని విడుదల చేయాలని వారు కోరుతూ ఈ మేరకు ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. అందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ ఒక టిఎంసి నీటిని విడుదల చేసేందుకు అంగీకరించారు. రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్‌డిఎస్) పనులను చేపట్టడంలో జరుగుతున్న జాప్యం వల్ల మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతున్నదని వారు ఆందోళన వ్యక్తం చేయగా, ఈ సీజన్‌లోనే పనులు చేపడతామని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. కేజ్ 1,2 పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆర్‌డిఎస్ ఆనికట్ 6 అంగుళాలు పెంచి నిర్మించడంతో పాటు కాలువల ఆధునీకరణ పనులు చేపట్టాలని, దీని వల్ల మహబూబ్‌నగర్ జిల్లాలో 84 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని వారు వివరించారు. నిజానికి 15.9 టిఎంసిల నీరు మహబూబ్‌నగర్ జిల్లా పంటలకు నీరు అందాల్సి ఉందని, అయితే నీరు అందక పంటలు దెబ్బతిన్నాయని, రైతులు కూలీలుగా మారాల్సి వస్తున్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ మంచి నీటి కోసం ఒక టిఎంసి నీరు విడుదలకు వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చినందుకు, ఆర్‌డిఎస్ పనులు వెంటనే వేగవంతం చేయిస్తామని చెప్పినందుకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

చిత్రం కర్నాటక సిఎం సిద్ధరామయ్యకు వినతిపత్రం ఇస్తున్న టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి