జాతీయ వార్తలు

మేడిగడ్డపై ముందుకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: మేడిగడ్డ బ్యారేజీ (కాళేశ్వరం ప్రాజెక్టు) నిర్మాణానికి తెలంగాణ, మహారాష్టల్ర మధ్య చర్చలు సఫలమయ్యాయి. మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్‌తో ముంబయిలో తెలంగాణ నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగళవారం సమావేశమయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించి వివరంగా చర్చించారు. హైదరాబాద్‌లో జరిగే గోదావరి అంతర్ రాష్ట్ర మండలి సమావేశానికి హాజరుకావాలని మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్‌ను హరీశ్‌రావు ఆహ్వానించారు. అందుకు ఫడ్నవీస్ సైతం అంగీకరించారు. రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల మంత్రులు, అధికారులు ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లు, ప్లాను, సాంకేతిక వివరాలపై రెండు రాష్ట్రాల సెంట్రల్ డిజైను అర్గనైజేషన్ (సిడివో) ఇంజనీర్లు తుది నిర్ణయం తీసుకుంటారు. తర్వాత జరిగే గోదావరి అంతర్ రాష్ట్ర బోర్డు అపెక్స్ కమిటీ సమావేశానికి సిడిఓల నివేదిక ప్రాతిపదిక కానుంది. తెలంగాణ, మహారాష్టల్ర సాగునీటి పారుదల శాఖల మంత్రులు టి. హరీశ్‌రావు, గిరీష్ మహాజన్ , తెలంగాణ ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్‌కె జోషి, కాళేశ్వరం చీఫ్ ఇంనీర్ వెంకటేశ్వర్లు, మహారాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి, ఇతర అధికారులు చర్చల్లో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మహారాష్టల్రో ఎలాంటి ముంపు సమస్య ఉండదని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు మహారాష్ట్ర మంత్రికి వివరించారు. రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారుల బృందాలు సంయుక్తంగా జరిపిన సర్వే వివరాలను ఇద్దరు మంత్రులు సమీక్షించారు. మేడిగడ్డ ప్రాజెక్టు వల్ల తలెత్తే ముంపు సమస్యలపై వ్యాప్కోస్, రెండు రాష్ట్రాల బృందాలు సర్వే జరిపాయి. మేడిగడ్డ ప్రాజెక్టు (కాళేశ్వరం) వల్ల మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలోని 11 గ్రామాల సరిహద్దుల్లో కేవలం 55 హెక్టార్ల భూమి మాత్రమే ముంపునకు గురవుతుందని రెండు రాష్ట్రాల మంత్రులు నిర్ధారణకు వచ్చారు. అతి తక్కువ ముంపుతోనే ప్రాజెక్టులు నిర్మించాలని సిఎం కెసిఆర్ సంకల్పించినట్టు హరీశ్‌రావు మహారాష్ట్ర బృందానికి వివరించారు. అయితే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం వల్ల 25 గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయని, 25వేల హెక్టార్లలో భూములు ముంపునకు గురవుతాయంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు విష ప్రచారం చేయడం, సిరొంచ తదితర ప్రాంతాల్లో దురుద్దేశపూర్వకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడాన్ని ఇరు రాష్ట్రాల మంత్రులు ముంబయిలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఖండించారు. సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంలో కాంగ్రెస్ రాష్ట్రానికో విధానం పాటిస్తోందని మంత్రులు విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలోని లెండి ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మహారాష్ట్ర దీనికి సానుకూలంగా స్పందించింది. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో రెండు రాష్ట్రాలు ప్రాజెక్టులు నిర్మించుకోవాలని, రెండు రాష్ట్రాల రైతులకు మేలు జరగాలని హరీశ్‌రావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

చిత్రం మహారాష్ట్ర ఇరిగేషన్ మంత్రి గిరీష్ మహాజన్‌తో చర్చలు జరుపుతున్న తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీశ్