జాతీయ వార్తలు

విపక్షం నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్తంభింపజేసేందుకు కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్షం శుక్రవారం చేసిన ప్రయత్నాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ వమ్ము చేశారు. ప్రతిపక్షం సభ్యులు పోడియం వద్దకు వచ్చి రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ఎన్‌డిఏ సంకీర్ణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ పెద్దఎత్తున గొడవ చేశారు. అయితే సుమిత్రా మహాజన్ మాత్రం సభను వాయిదా వేయకుండా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు. లోక్‌సభ సమావేశం కాగానే సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతిపక్షం మాత్రం ఇందుకు సమ్మతించలేదు. కరవు మూలంగా నష్టపోయిన రైతుల సమస్యల గురించి చర్చించేందుకు తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని పట్టుపట్టారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం తర్వాత మాట్లాడే అవకాశం ఇస్తానని సుమిత్రా మహాజన్ ఎంత నచ్చజెప్పినా ప్రతిపక్ష సభ్యులు పట్టించుకోలేదు. కొందరు సభ్యులు పోడియం వద్దకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ సభను స్తంభింపజేసేందుకు ప్రయత్నించారు. మామూలుగా పోడియం వద్దకు వచ్చి గొడవ చేయగానే సభ వాయిదా పడటం ఆనవాయితీ. అయితే సుమిత్రా మహాజన్ మాత్రం సభను వాయిదా వేసేందుకు ఇష్టపడలేదు. ప్రతిపక్ష సభ్యులు ఎంత గొడవ చేసినా స్పీకర్ పట్టించుకోకుండా ప్రశ్నలపై చర్చ జరిపి మంత్రులతో సమాధానం ఇప్పించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం సజావుగా కొనసాగేందుకు సహకరించాలని పలుమార్లు ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. అయినా సభ్యులు ఆమె విజ్ఞప్తులను పక్కన పెట్టి నినాదాల హోరును కొనసాగించారు.

చిత్రం.. స్పీకర్ సుమిత్రా మహాజన్