జాతీయ వార్తలు

డోక్లామ్ మాదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: డోక్లామ్ నుండి సైన్యాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్‌లో ప్రకటించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ, డోక్లామ్ సమస్యపై అర్థవంతమైన సంప్రదింపులు జరిగేందుకు రెండు దేశాల సైన్యాలు అక్కడినుండి ఉపసంహరించుకోవాలని ప్రతిపాదించటం తెలిసిందే. ఈ ప్రతిపాదనను గ్లోబల్ టైమ్స్ తిరస్కరించింది. డోక్లామ్ విషయంలో తమ దేశం తీరును ప్రపంచ దేశాలు సమర్థిస్తున్నాయని సుష్మా స్వరాజ్ చేసిన ప్రకటనను కూడా గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్ ఖండించింది. డోక్లామ్‌పై అర్థవంతమైన చర్చ జరగాలంటే భారతదేశం ముందుగా తమ సైన్యాలను ఉపసంహరించుకోవాలని చైనా మరోసారి డిమాండ్ చేసింది. భారత సైనికులు చైనా భూభాగంపై దాడి చేశారనేది పచ్చి నిజం అని గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది. చైనా సైనిక శక్తితో పోలిస్తే భారత సైన్యం శక్తి అత్యంత తక్కువ అనేది మరిచిపోరాదంటూ హెచ్చరించేందుకు ప్రయత్నించింది. డోక్లోమ్ తమ భూభాగం, అక్కడ్నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవటం అనేది జరిగే పనికాదని స్పష్టం చేసింది. డోక్లామ్ తమ ప్రాంతం, అక్కడ రోడ్డు నిర్మించుకునే పూర్తి అధికారం తమకు ఉంది కాబట్టి భారత సైన్యం బేషరతుగా వెనకకు వెళ్లిపోవాలని సూచించారు.
బీజింగ్‌కు దోవల్
బీజింగ్‌లో ఈ నెల 27, 28 తేదీల్లో జరుగనున్న బ్రిక్స్ ఎన్‌ఎస్‌ఏ సమావేశానికి హాజరయ్యేందుకు జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్‌కు వెళుతున్నారు. భారత, చైనా దేశాల సైన్యాల మధ్య సిక్కిం ఎక్టార్‌లో ఉద్రిక్తత నెలకొన్న ప్రస్తుత తరుణంలో దోవల్ బీజింగ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. దోవల్ డోక్లామ్ ఉద్రిక్తత గురించి చైనా అధికారులతో చర్చలు జరిపే అవకాశం ఉంది.
సైనిక మోహరింపు
సిక్కిం సెక్టార్‌లోని డోక్లామ్‌లో రెండు దేశాల సైనికుల మధ్య దూరం కేవలం ఒక మీటరు మాత్రమే. రెండు దేశాల సైనికులు ఇరవై నాలుగు గంటల పాటు అలాగే నిలడుతున్నారు. చైనా సైనికులను ఎదుర్కొంటున్న సైనికులను భారత సైన్యం ప్రతి రెండు గంటలకు ఒకసారి మారుస్తున్నారు. చైనా కూడా ఇదే విధంగా సైనికులను మారుస్తోంది. డోక్లామ్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో సైనికుల సమీకరణ జరుపుతోంది. చైనా దాదాపు ఐదు వేల సైనికులను సిద్ధం చేసినట్లు డ్రోన్ సర్వేలో వెల్లడైంది. భారత్‌కూడా తమవైపు దాదాపు ఐదు వేల మంది సైనికులను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డోక్లామ్‌కు దక్షిణ భాగంలో ఉన్న జంపరి రిడ్జ్‌ను స్వాధీనం చేసుకునే లక్ష్యంతో చైనా ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని స్వాధీనం చేసుకుంటే అక్కడినుండి భారత్ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే చికెన్‌నెక్ ప్రాంతంపై దృష్టి పెట్టేందుకు చైనా సైనికులకు వీలుకలుగుతుంది. అంటే జంపరీ రిడ్జ్ ద్వారా భవిష్యత్‌లో చికెన్‌నెక్‌ను స్వాధీనం చేసుకుని తద్వారా ఈశాన్య రాష్ట్రాలను భారత భూభాగం నుండి వేరుచేసే లక్ష్యంతో చైనా పావులు కదుపుతోంది. చైనా-్భరత్-్భటాన్ ట్రై జంక్షన్ ఏది అనేది కూడా వివాదాస్పదంగా మారింది. మూడు దేశాలను కలిపే ట్రై జంక్షన్ బటంగ్ లా వద్ద ఉన్నదని భారతదేశం వాదిస్తుంటే చైనా ఈ వాదనను కొట్టి వేస్తోంది. ట్రై జంక్షన్ బటంగ్ లాకు ఆరు కిలోమీటర్ల దూరంలోని గైమోకెమ్ వద్ద ఉన్నదని చైనా చెబుతోంది.