జాతీయ వార్తలు

అసెంబ్లీ సీట్లు ఇప్పట్లో పెరగవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభల సీట్లు పెంచేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపాదించే సూచనలు కనిపించటం లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పచ్చజెండా చూపిస్తేతప్ప ఈ బిల్లుకు మోక్షం లభించదని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కొనసాగుతున్న సమావేశాల్లో ఈ బిల్లును ప్రతిపాదిస్తేనే 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి సీట్లు పెంచేందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడీ బిల్లును ఆమోదించకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా రెండు శాసనసభల సీట్లు పెరగటం చాలా కష్టమని అంటున్నారు. తెలంగాణ శాసనసభ సీట్ల సంఖ్యను 119 నుండి 153, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సీట్లను 175 నుండి 225కు పెంచాలని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రతిపాదించటం తెలిసిందే. రాజ్యాంగం 170వ అధికరణంలో నియమాలకు లోబడి, ఈ చట్టం సెక్షన్ 15 నియమాలకు భంగం కలగకుండా రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభల సీట్లను పెంచాలని విభజన చట్టంలో పొందుపరిచారు. అసెంబ్లీ సీట్లను ఇప్పుడే పెంచటం వలన బిజెపికి రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం కలగదని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నందుకే సీట్ల పెంపకానికి సంబందించిన బిల్లును పెండింగ్‌లో పెట్టారని అంటున్నారు. సీట్ల పెంపునకు సంబంధించిన పరిపాలనా పరమైన ప్రక్రియ పూర్తయింది. ముసాయిదా బిల్లు కేంద్ర న్యాయ శాఖ నుండి హోం శాఖకు చేరింది. మంత్రివర్గం ఆమోదముద్ర తీసుకునేందుకు సంబంధించిన నోటుకూడా సిద్ధమైంది.
అయితే రాజకీయ కారణాల మూలంగా ప్రస్తుతం దీనిని పెండింగ్‌లో పెట్టారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాదిలో ప్రాబల్యాన్ని పెంచుకోవాలనుకుంటున్న తరుణంలో తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితికి రాజకీయంగా ప్రయోజనం కలిగించేలా శాసనసభల సీట్లు పెంచటం మంచిది కాదని అమిత్ షా భావిస్తున్నట్లు తెలిసింది. 2019లో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితితో సీట్ల సర్దుబాటు జరిగే పక్షంలో శాసనసభల సీట్లు పెంచటం మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి వచ్చే సోమవారం బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిఖ శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి తెలుగు రాష్ట్రాల శాసనసభల సీట్లు పెంచటం గురించి చర్చించనున్నట్లు తెలిసింది. నరేంద్ర మోదీ ఆమోదముద్ర వేస్తే తప్ప రెండు శాసనసభల సీట్లు పెరగవని టిడిపి ఎంపీలు చెబుతున్నారు.