జాతీయ వార్తలు

వందరోజులన్నా భేటీ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, జూలై 22: పార్లమెంటు సమావేశాలు ఏడాదికి కనీసం వంద రోజులు జరిగేలా ఒక చట్టాన్ని తీసుకురావాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. గత రెండు మూడేళ్లుగా పార్లమెంటు ఏడాదికి 60-70 రోజులకు మించి సమావేశం కాలేదని ఆయన చెప్పారు. ‘పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు కనీసం వంద రోజులు సభ్యులు చురుగ్గా పాలుపంచుకునేలా చూసే ఒక చట్టాన్ని చేయాల్సిన అవసరం ఉంది. లెజిస్లేటివ్ కార్యకలాపాల పట్ల పెరిగిపోతున్న నిరాసక్తత, నిర్లక్ష్య ధోరణిని పోగొట్టడానికి ఇలాంటి చట్టం అత్యవసరం’ అని ఏచూరి అన్నారు. బ్రిటన్‌లో పార్లమెంటు ఏడాదికి 200 రోజులు సమావేశమవుతుందని శుక్రవారం రాత్రి ఇక్కడ కామ్రేడ్ శైలేంద్ర షెల్లీ స్మారకోపన్యాసం ఇస్తూ ఏచూరి అన్నారు.