జాతీయ వార్తలు

ఉదయ్‌పూర్‌లో బస్సు ప్రమాదం.. 9 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయ్‌పూర్, జూలై 22: అహ్మదాబాద్ నుంచి యాత్రికులతో బయలుదేరిన బస్సు రాజస్తాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లోని నెహ్లా గ్రామంలో ప్రమాదానికి గురైన సంఘటనలో 9 మంది మృతిచెందగా, 22మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలున్నారు. యాత్రికులను తీసుకెళ్తున్న గుజరాత్‌కు చెందిన ప్రైవేటు బస్సు శనివారం నెహ్లా గ్రామంలో డ్రైవర్ ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి పల్టీ కొట్టింది. శుక్రవారం అహ్మదాబాద్‌లో 16రోజుల యాత్రలో భాగంగా పుష్కర్, హరిద్వార్ తదితర ప్రాంతాలను యాత్రికులను తీసుకెళ్లే క్రమంలో బయలు దేరిన బస్సు శనివారం ఉదయ్‌పూర్‌లోని నెహ్లా గ్రామంలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని ఉయద్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించామని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారంతా 45సంవత్సరాలు పైబడిన వారేనని ఎస్పీ వెల్లడించారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.