జాతీయ వార్తలు

1971ని మరవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: పొరుగు దేశం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకుందని ఎన్డీయే ఉపరాష్టప్రతి అభ్యర్థి వెంకయ్య నాయుడు మండిపడ్డారు. ఢిల్లీలో ప్రతి ఏటా కార్గిల్ అమరవీరుల స్మారకార్థం నిర్వహిస్తున్న కార్గిల్ పరాక్రమ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ఆపేయాలని పాకిస్తాన్‌కి ఆయన హితువు పలికారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశాల జాజితాలో పాకిస్తాన్‌ను అమెరికాతోపాటు ఇతర దేశాలు కూడా గుర్తించాయని ఆయన వెల్లడించారు. నిషిద్ధ జైషే మహ్మద్, లష్కరే తోయిబాలాంటి ఉగ్రవాద సంస్థలు పాక్‌లోనే శిక్షణ పొందుతున్నాయని, అక్కడినుంచే నిధులు సమీకరిస్తున్నాయని అమెరికా కూడా గుర్తించినట్టు వెంకయ్య తెలిపారు. ఉగ్రవాదం నుంచి పొంచివున్న ముప్పును, ఎలాంటి చర్యలకు పాల్పడినా తిప్పికోట్టేందుకు మన దేశం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. 1971లో ఏం జరిగిందో పాక్ గుర్తుంచుకోవాలని, అప్పుడు జరిగిన 13 రోజుల యుద్ధంలో పాక్ ఘోరంగా ఓడిపోయి, పాక్ చెరనుంచి తూర్పు పాకిస్తాన్‌కు విముక్తి కల్పించడంలో భారత్ విజయవంతమైందని ఆయన చెప్పారు. ఉగ్రవాదం మానవత్వానికి శత్రువని, దానికి మతం లేదని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్ భారత్‌లో అంర్భాగమని, అందులోని ఒక ఇంచు భూభాగాన్ని కూడా వదులుకునే ప్రసక్తి లేదని వెంకయ్య స్పష్టం చేశారు. 1999లో కార్గిల్ యుద్ధంలో మన దేశంకోసం అద్భుతమైన విజయాన్ని అందించిన సైనికుల ధైర్యసహసాలు, వారి త్యాగాలు గుర్తు చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. అలాగే మన దేశం స్థిరమైన ప్రభుత్వం ఆర్థిక, సాంకేతిక పరంగా ప్రపంచంలోనే అగ్రగామిగా రూపొందుతోందని ఆయన చెప్పారు.